సంచలనాల రాంగోపాల్ వర్మ ఏం మాట్లాడినా పెను సంచలనమే. ఎలాంటి పరిస్థితుల్ని అయినా.. ఎలాంటి సందర్భాల్ని అయినా వర్మ సునాయాసంగా ఫేస్ చేయగల దిట్ట. వందమంది ఒకేసారి వచ్చినా... ఒక్కొక్కరుగా వచ్చినా కూల్ గా తనదైన పంచ్ తో బదులివ్వగలడు. సమాధానం ఇవ్వలేని పక్షంలో కనీసం కన్ఫ్యూజ్ చేసే తెలివితేటలున్నాయి. ఆయన మాట్లాడటానికి ఒక వేదిక అవసరం లేదు. ఆయన ఎక్కడుండి మాట్లాడినా అదే గొప్ప వేదిక. ఎందుకుంటే వర్మ ఎంచుకునే కంటెంట్ అలాంటిది కాబట్టి. ఆ సంగతిని పక్కనబెడితే వర్మ కరోనా సమయంలోనూ ఖాళీ లేకుండా బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. తన ఓటీటీ ప్లాట్ ఫాం పై తనకు నచ్చిన విధంగా సినిమాలు చేసి రిలీజ్ చేసాడు. జయాపజయాలతో సంబంధం లేకుండా తాను చెప్పాలనుకున్నది..చూపించాలనుకున్నది ప్రేక్షకులకు చూపించారు.
వర్మ డీ-కంపెనీ నుంచి ఇంతకాలానికి `డేంజరస్` రిలీజ్ కి రెడీ అవుతోన్న సంగతి తెలిసిందే. ఈనేపథ్యంలో ఈ సినిమాకి వర్మ బజ్ తీసుకొచ్చే ప్రయత్నంలో నిమగ్నమయ్యారు. తన సినిమాల్ని మార్కెట్ కి ఎలా ఎక్కించాలో ఆయనకు బాగా తెలసుకు కాబట్టి మరోసారి టీవీ డిబేట్లకు హాజరవుతూ తన సినిమాని ప్రమోట్ చేసుకుంటున్నారు. `డేంజరస్` సినిమాతో వర్మ మరోసారి బోల్డ్ కంటెట్ ని ఎంపిక చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఆ సినిమా గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు.
``ఒక అమ్మాయి ఉంటే బ్యూటీ..అదే ఇద్దరమ్మాయిలు ఉంటే డబుల్ బ్యూటీ.. అందుకే ఈ సినిమా చేసాను. అందుకే ఇద్దరు లెస్బియన్ అమ్మాయిలతో ఈ సినిమా చేసాను. వాళ్ల ఫీలింగ్స్ అంటే ఎంతో ఇష్టం నాకు. వాళ్లు అంటే ఎంతో గౌరవం కూడా. అందుకే వాళ్లతో ఎంతో ఇష్టపడి సినిమా చేసాను. అదే ఇద్దరు లెస్బియన్ మగాళ్ల మధ్య సినిమా తీయమంటే తీయను. ఎందుకంటే వాళ్లంటే నాకు అస్సలు నచ్చదు..ఇష్టం ఉండదు. ఒకవేళ తీసినా చూసే ధైర్యం అయితే చేయను. ఎందుకంటే నాకు కేవలం అమ్మాయిలంటేనే ఇష్టం``అని తనదైన శైలిలో చెప్పుకొచ్చారు వర్మ.
అలాగే వర్మ కొండా సురేఖ జీవిత కథ ఆధారంగా `కొండా` టైటిల్ తో మరో చిత్రాన్ని తెరకెక్కిస్తోన్న సంగతి తెలిసిందే. ఇటీవలే ఆ సినిమాకి సంబంధించిన ఓ పాటను కూడా రిలీజ్ చేసారు. మరోవైపు ఈటల వెన్నుపోటు అంటూ మరో సినిమా తీస్తున్నారని ఇటీవల ప్రచారమైంది. కానీ ఇది ఫేక్ వార్త అంటూ వర్మ ఖండించారు.
వర్మ మరో రక్తచరిత్ర `కోండా`
ఇక వర్మ పని అయిపోయింది అన్న ప్రతీసారి ఏదో ఒక స్ట్రాంగ్ స్టోరీతో అటెన్షన్ ని క్రియేట్ చేస్తూ మళ్లీ బౌన్స్ బ్యాక్ అవుతున్నాడు. తాజాగా వర్మ చేతికి లబించిన బ్రహ్మాస్త్రం కొండా మురళి. వరంగల్ రాజకీయ ముఖ చిత్రంలో.. జిల్లా రాజకీయాల్లో అత్యంత కీలకంగా నిలిచిన వ్యక్తులు కొండా మురళి... కొండా సురేఖ.. వీరి ప్రేమకథ.. కొండా మురళీ రాజకీయ జీవితం.. వారీ జీవితాల్లో జరిగిన నాటకీయ పరిణామాల గురించి వరంగల్ చుట్టుపక్కల గ్రామాల్లో ఇప్పటికీ
కథలు కథలుగా చెప్పుకుంటుంటారు.
తాజాగా వీరి జీవిత కథ ఆధారంగా వర్మ `కొండా` చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్టుగా ప్రకటిస్తూ ఇటీవల ఓ ఆడియో వీడియోని విడుదల చేశాడు. తెలంగాణలో నేను విన్న విషయాల్లో నన్ను విపరీతంగా ఆకర్షించింది ఎన్ కౌంటర్ లో చంపేయబడ్డ ఆర్కే అలియాస్ రామకృష్ణకి ..ఇంకా కొండా మురళికి వున్న ఒక మహా ప్రత్యేకమైన సంబంధం..ఆ ఎక్స్‌ట్రార్డినరీ బ్రాగ్రౌండ్.. అప్పటి పరిస్థితులు.. సినిమాటిక్ గా క్యాప్చర్ చేయటానికి నేను మురళీగారిని కూడా కలిసి ఆయన ద్వారా ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవటానికి కోపరేట్ చేయమని కోరాను. ఈ సినిమా తీయటం వెనకున్న నా ఉద్దేశాన్ని ఆయన కూడా ఒప్పుకున్నారు. విపరీత పరిస్థితుల నుంచే విపరీత వ్యక్తులు ఉద్భవిస్తారని కారల్ మార్క్స్ 108 ఏళ్ల క్రిమే చెప్పారు. అలా విపరీత పరిస్థితుల మధ్య పుట్టిన వారే కొండా మేరళి .. కొండా సురేఖ.. నేను తీస్తున్నది సినిమా కాదు రక్త చరిత్ర.. అంటూ వర్మ మరో రక్త చరిత్రకు శ్రీకారం చుట్టారు.
ఈ సినిమా ద్వారా ఉత్తర తెలంగాణకు గుండెకాయ అయినటు వంటి వరంగల్ చరిత్రలో సంచలనంగా మారిన పలు ఆసక్తికర విషయాలతో పాటు ప్రపంచం నివ్వెరపోయే సంఘటనలకు సంబంధించిన సాక్ష్యాలు బయటికి రానున్నట్టుగా తెలుస్తోంది. ఈ మూవీని యోయో టాకీస్ బ్యానర్ పై మల్లారెడ్డి.. నవీన్ రెడ్డి నిర్మిస్తున్నారు. ఇంతకీ కొండా పాత్రలో నటించేది ఎవరు? .. కొండా సురేఖగా ఎవరిని చూపిస్తారు.. వంటి పలు ఆసక్తికర విషయాలు త్వరలోనే వర్మ వెల్లడించే అవకాశం వుంది.