కొంతమంది హీరోయిన్స్ యాక్టింగ్ లో అయితే చాలా మంచి గుర్తంపును అందుకుంటుంటారు కానీ వారి బ్యాడ్ లక్ ఏమిటో.. మరో రేంజ్ కి వెళ్లే సినిమాలో అవకాశాలు అంత తొందరగా రావు. ఇక గత రెండు మూడేళ్లుగా విభిన్నమైన క్యారెక్టర్స్ తో నటిగా మంచి గుర్తింపు నందుకుంటున్న వర్షా భోల్లమ్మ కూడా మరో రేంజ్ కి వెళ్ళాలి అని గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ ఈ బ్యూటీ పెద్దగా సక్సెస్ అయితే అనుకోవడం లేదు.
వర్షం బోళ్లమ్మ 2015 నుంచి సినిమా ఇండస్ట్రీలో కొనసాగుతోంది. ఈ బ్యూటీ తమిళంలో చేసిన మొదటి రెండు మూడు సినిమాలకు మంచి గుర్తింపు లభించింది ఇక ఆ తర్వాత విజయ్ సేతుపతి త్రిష నటించిన ట్రెండ్ సెట్ లవ్ స్టోరీ 96 లో మంచి పాత్ర చేసి సౌత్ ఇండస్ట్రీని ఒక్కసారిగా అట్రాక్ట్ చేసింది. అలాగే విజయ్ బిగిల్ సినిమాలో ఫ్యూట్బాల్ ప్లేయర్ గా కూడా ఆడియెన్స్ ను ఎమోషనల్ గా టచ్ చేసింది.
అప్పటి నుంచి ఈ పాపకు ఆఫర్లు రావడం స్టార్ట్ అయ్యాయి. అయితే ఆఫర్లు వస్తున్నాయి.. కానీ కనీసం మీడియం హీరోలతో జతకట్టే సినిమాలు అయితే రావడం లేదు. ఇక తెలుగులో మొదట 2020లో 'చూసి చూడంగానే' అనే సినిమాలో నటించింది. ఆ తర్వాత 96 రీమేక్ జాను లో కూడా అదే తరహా పాత్రలో కనిపించింది. అనంతరం విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ మిడిల్ క్లాస్ మెలోడిస్ లో మంచి పెర్ఫామెన్స్ ఇచ్చింది.
ఆ సినిమా పాజిటివ్ టాక్ అందుకుంది కానీ ఓటీటీలో విడుదల కావడం వలన ఇండస్ట్రీలో పెద్దగా ఫోకస్ అయితే అవ్వలేదు. అయినప్పటికీ కూడా ఏదో ఒక విధంగా అవకాశాలు అందుకుంటున్న వర్ష చివరగా 'స్టాండప్ రాహుల్' లో నటించింది. కానీ ఆ సినిమా కూడా డిజాస్టర్ అయ్యింది.
ఇక ఇప్పుడు బెల్లంకొండ గణేష్ నటించిన స్వాతిముత్యం సినిమా పైన ఆశలు పెట్టుకుంది. ఈ సినిమా ట్రైలర్ అయితే పర్వాలేదు అనిపించే విధంగా ఒక పాజిటివ్ వైబ్రేషన్స్ అయితే క్రియేట్ చేసింది. కానీ అక్టోబర్ 5వ తేదీన పోటీగా మెగాస్టార్ గాడ్ ఫాదర్, నాగార్జున ఘోస్ట్ సినిమాలు విడుదలవుతున్నాయి. ఈ తీవ్రమైన పోటీని తట్టుకోవాలి అంటే సినిమాకు ఎంతో మంచి టాక్ వస్తే గాని వర్కౌట్ కాదు. మరి వర్షా ఈ సినిమాతో అయినా మరో రేంజ్ లో ఉన్న హీరోలతో ఛాన్స్ అందుకుంటుందో లేదో చూడాలి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.