బాహుబలి నిర్మాతల ఇళ్లు.. ఆఫీసులపై ఆదాయపు పన్ను అధికారులు దాడులు చేశారనే వార్తలు వచ్చాయి. అంతే కాదు.. 58 కోట్ల రూపాయలను సీజ్ చేశారనే రూమర్ కూడా ఉంది. ఈ విషయం నిజమా కాదా అనే సందేహాలు ఉన్నాయి. ఇప్పుడు కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు చెప్పిన మాటలు వింటే.. దీనిపై ఓ స్పష్టత వచ్చేయచ్చు.
"మీరు సినిమా సూపర్ హిట్ అయిందంటూ 100 కోట్లు.. 200 కోట్లు.. 300 కోట్లు వసూళ్లు వచ్చాయంటారు. మహాబలి అంటూ ఉంటారు. ఇప్పుడు ఇన్ కం ట్యాక్స్ అధికారులు కో బలి అని చెప్పి రికార్డులు చూపించమన్నారు. మీరు నిజంగా పన్నులన్నీ కట్టేసి ఉంటే ఇందులో భయపడాల్సిన పనేమీ ఉండదు. లేకపోతే ప్రభుత్వం మిమ్మల్ని జాగ్రత్తగా చూసుకుంటుంది" అని ఫిలిం నగర్ క్లబ్ లో జరిగిన ఓ కార్యక్రమంలో అన్నారు వెంకయ్య నాయుడు.
మహాబలి.. కో బలి.. మాటలు వింటే.. బాహుబలి నిర్మాతలపై ఇన్ కం ట్యాక్స్ అధికారుల దాడుల గురించి చెప్పినట్లుగా అనిపించడంలో ఆశ్చర్యం లేదు. మంత్రి గారు చెప్పిన విషయం ప్రకారం.. బాహుబలి మేకర్స్ పై ఆదాయపు పన్ను దాడులు జరిగాయన్న మాట. మరి ఎంత సొమ్ము సీజ్ చేశారో.. ఆ మాట కూడా చెబితే బాగుండేది కదా!
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/