'భీమ్లానాయ‌క్‌' పై వెంకీమామ షాకింగ్ ట్వీట్

Update: 2022-02-26 08:30 GMT
ప‌వ‌న్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ న‌టించిన హైవోల్టేజ్ మాస్ మ‌సాలా యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్ `భీమ్లానాయ‌క్‌`. ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడు థియేట‌ర్ల‌లో ఈ మూవీ సంద‌డి చేస్తుందా అని గ‌త కొన్ని రోజులుగా వేయి క‌ళ్ల‌తో ఎదురుచూశారు. మొత్తానికి ఆ రోజు రానే వచ్చింది. భారీ అంచ‌నాల మ‌ధ్య `భీమ్లానాయ‌క్‌` ఈ శుక్ర‌వారం వ‌ర‌ల్డ్ వైడ్ గా విడుద‌లైన విష‌యం తెలిసిందే. మ‌ల‌యాళ హిట్ ఫిల్మ్ `అయ్య‌ప్ప‌నుమ్ కోషియుమ్‌` ఆధారంగా రూపొందిన ఈ చిత్రం తెలుగులో అనూహ్య విజ‌యాన్ని సాధించి ప‌వ‌న్ కు మ‌రో బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ ని అందించింది.

సాగ‌ర్ కె. చంద్ర డైరెక్ట్ చేసిన ఈ మూవీలో  రానా ద‌గ్గుబాటి కీల‌క పాత్ర‌లో న‌టించిన విష‌యం తెలిసిందే. అహంకారానికి త్మ‌గౌర‌వానికి మ‌ధ్య సాగే స‌మ‌రం నేప‌థ్యంలో ఈ మూవీని ద‌ర్శ‌కుడు సాగ‌ర్ కె. చంద్ర అత్యంత ప‌వ‌ర్ ఫుల్ గా తెర‌పైకి తీసుకొచ్చారు. నిత్యామీన‌న్‌, సంయుక్త మీన‌న్ హీరోయిన్ లుగా న‌టించిన ఈ చిత్రం ప్ర‌స్తుతం బాక్సాఫీస్ వ‌ద్ద సంచ‌ల‌నం సృష్టిస్తోంది. ప‌వ‌న్ నుంచి చాలా రోజుల త‌రువాత మాస్ మ‌సాలా యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్ రావ‌డంతో ఫ్యాన్స్ సంబ‌రాలు చేసుకుంటున్నారు.

సినిమాపై, ప‌వ‌న్ పై ప్ర‌శంస‌లు కురిపిస్తున్నారు. ఫ్యాన్స్ త‌ర‌హాలోనే ప‌వ‌న్ నుంచి ప‌వ‌ర్ ప్యాక్డ్ యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్ ని ఆశించిన సెల‌బ్రిటీలు `భీమ్లానాయ‌క్‌` రూపంలో ఆశించిన సినిమా రావ‌డంతో చిత్ర బృందంతో పాటు టైటిల్ పాత్ర‌లో న‌టించిన ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ పై , కీల‌క పాత్ర‌లో న‌టించిన రానా పై ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపిస్తున్నారు. డైరెక్ట‌ర్ హ‌రీష్ శంక‌ర్ ట్వీట్ తో ఈ ప్ర‌శంస‌ల ప‌రంప‌ర మొద‌లైంది. `భీమ్లానాయ‌క్‌` నిజ‌మైన ప‌వ‌ర్ స్టార్మ్ స‌క్సెస్ అయినందుకు తాజాగా మెగాస్టార్ చిరంజీవి ట్విట్ట‌ర్ వేదిక‌గా చిత్ర బృందాన్ని అభినందించారు.

తాజాగా వెంకీ మామ విక్ట‌రీ వెంట‌కటేష్ `భీమ్లానాయ‌క్‌`పై  ప్ర‌శంస‌లు కురిపించారు. `భీమ్లానాయ‌క్` మ్యాగ్నిఫిసెన్స్‌.. డేనియ‌ల్ శేఖ‌ర్ మెరుపుదాడి స‌క్సెస్‌ని టేకోవ‌ర్ చేసుకుంది. రానా న‌ట‌న అద్భుతం. `భీమ్లానాయ‌క్‌` ఘ‌న‌విజ‌యం సాధించిన సంద‌ర్భంగా టీమ్ అంద‌రికి శుభాకాంక్ష‌లు`అని హీరో వెంక‌టేష్ ట్వీట్ చేయ‌డం ఆక‌ట్టుకుంటోంది. హీరో నితిన్ పెట్టిన పోస్ట్ కూడా నెట్టింట వైర‌ల్ గా మారింది. `ఇది క‌దా మాకు కావాల్సింది.. రానా ద‌గ్గుబాటి ఇర‌గ్గొట్టావ్` అంటూ ప‌వ‌న్ స్కెచ్ ని ముద్దు పెట్టుకుంటున్న ఫొటోని నితిన్ షేర్ చేశాడు.
Tags:    

Similar News