స్పెష‌ల్: విక్ట‌రీకి, వినోదానికి కేరాఫ్ అడ్ర‌స్

Update: 2015-12-13 04:33 GMT
టాలీవుడ్‌ లో విక్ట‌రీ వెంక‌టేష్ ప్ర‌స్థానం అసాధార‌ణం. వినోదానికి గ్యారెంటీ ఇచ్చే హీరోగా అత‌డు పాపుల‌ర్‌. ఆరేళ్ల నుంచి 60 ఏళ్ల ముస‌లాళ్ల వ‌ర‌కూ వెంకీ సినిమాల‌కు, వెంకీకి అభిమానులే. ముఖ్యంగా మ‌హిళా ప్రేక్ష‌కులు విప‌రీతంగా అభిమానించే టాలీవుడ్ హీరో వెంకీ. ఆహ్ల‌ద‌క‌ర‌మైన వినోదం అందించే ప్లెజెంట్ హీరోగా అత‌డికి పేరుంది. క‌లియుగ పాండ‌వులు నుంచి గోపాల గోపాల వ‌ర‌కూ.. అత‌డి కెరీర్ దిగ్విజ‌యంగా సాగింది. ప్ర‌స్తుతం అత‌డు మారుతి ద‌ర్శ‌క‌త్వంలో సినిమా చేస్తున్నాడు. త్వ‌ర‌లోనే మూవీ ప్రారంభోత్స‌వం  జ‌ర‌గ‌నుంది. డిసెంబ‌ర్ 13 విక్ట‌రీ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా ఓ మారు కెరీర్‌ ని త‌ర‌చి చూస్తే...

డాక్ట‌రు కాబోయి యాక్ట‌రు అయిన‌ట్టు, నిర్మాత కాబోయి హీరో అయ్యాడు వెంకీ. ప్రారంభం తండ్రి డా.డి.రామానాయుడు అడుగుజాడ‌ల్లో నిర్మాత అవ్వాల‌నుకున్నాడు. కానీ అనుకోకుండానే ముఖానికి రంగేసుకోవాల్సి వ‌చ్చింది. నాయుడుగారి ఎంక‌రేజ్‌ మెంట్‌ తో హీరోగా ప్ర‌స్థానం మొద‌లైంది.

1986లో 'కలియుగ పాండవులు' సినిమాతో వెంకీ హీరో అయ్యారు.  తొలి సినిమాతోనే తెలుగువారి మ‌న‌సు దోచాడు. ఉత్తమ ప్రారంభ హీరోగా  'నందిస పుర‌స్కారం అందుకున్నాడు. కెరీర్ ఆరంభ‌మే దాదాపు ప‌ది సినిమాల హీరోగా ఉన్న‌ప్పుడు.. కె.విశ్వ‌నాథ్ ద‌ర్శ‌క‌త్వంలో 'స్వర్ణ కమలం' (1988) సినిమాలో న‌టించాడు. అది అత‌డిలోని పొటెన్షియాలిటీని బైటికి తెచ్చింది. ఈ చిత్రంలో నటనకు నంది స్పెషల్‌ జూరీ పుర‌స్కారం ద‌క్కింది.  'బ్రహ్మపుత్రుడు'  'ప్రేమ` చిత్రాల‌తో వ‌రుసగా విజ‌యాలు అందుకున్నాడు.

ప్రేమ చిత్రంలో న‌ట‌న‌కు ఉత్తమ నటుడిగా  రెండోసారి నంది అవార్డు అందుకున్నాడు. వారసుడొచ్చాడు - 'బొబ్బిలిరాజా` బ్లాక్‌ బ‌స్ట‌ర్స్ సాధించాక .. వెంకీ ఇక వెనుతిరిగి చూసుకునే ప‌నేలేకుండా స్టార్‌ డ‌మ్‌ ని అందుకున్నాడు.  'కూలీ నంబర్‌-1 -'శత్రువుస‌  - 'క్షణక్షణం' సినిమాల‌తో న‌టుడిగా మ‌రో మెట్టు ఎక్కాడు. ఆ త‌ర్వాత రీమేక్ చిత్రం `చంటి`తో ఇమేజ్ రెట్టింపైంది. అదే సినిమాతో బాలీవుడ్‌ లోనూ అడుగుపెట్టాడు. 'అనారీ' టైటిల్‌ తో చంటి బాలీవుడ్‌ లో రీమేకై విజయం సాధించింది.  'సూర్య ఐపీఎస్‌ - 'చినరాయుడు  - 'సుందరకాండ - 'ధర్మ చక్రం' నటుడిగా వెంకీని మరో స్థాయిలో నిల‌బెట్టాయి.  ధ‌ర్మ‌చ‌క్రం సినిమాతో ఉత్తమ నటుడిగా మరో నంది ద‌క్కించుకున్నాడు. 'ప్రేమించుకుందాం రా  - 'సూర్యవంశంస వంటి  ఫ్యామిలీ ఎంటర్‌ టైనర్స్‌ లో న‌టించిన వెంకీ... కెరీర్‌ కి గణేష్‌ (1988) ఓ స్పెష‌ల్ మూవీ. నీ చిత్రంతో కెరీర్‌ లో మ‌రో నంది పుర‌స్కారం అందుకున్నాడు. 'ప్రేమంటే ఇదేరా - 'రాజా - 'జయం మనదేరా'-  'కలిసుందాం రా` వంటి విజ‌యంత‌మైన చిత్రాల్లో న‌టించాడు వెంకీ. వీటిలో జ‌యం మ‌న‌దేరా చిత్రానికి క్రిటిక్స్ ప్ర‌శంస‌లు వ‌చ్చాయి. ఫిలింఫేర్ ద‌క్కింది.

2003 నుంచి 2008 మ‌ధ్య‌లో వ‌రుస విజ‌యాలందుకున్నాడు. వ‌సంతం - మల్లీశ్వరి - ఘర్షణ - సంక్రాంతి - ఆడవారి మాటలకు అర్థాలే వేరులే - చింతకాయల రవి  సినిమాలు విజ‌య‌వంత‌మైన చిత్రాలుగా నిలిచాయి.  2014లో దృశ్యం చిత్రంతో కెరీర్ బ్లాక్‌ బ‌స్ట‌ర్ హిట్ అందుకున్నాడు. ఆ త‌ర్వాత ప‌వ‌న్‌ క‌ల్యాణ్ తో క‌లిసి న‌టించిన గోపాల గోపాల ఈ ఏడాది ఆరంభ‌మే రిలీజై బ్లాక్‌ బ‌స్ట‌ర్ హిట్ సాధించింది. త్వరోలనే మారుతి డైరక్షన్‌ లో ఓ కామెడీ ఎంటర్‌ టైనర్‌ తో మన ముందుకు రానున్నాడు వెంకీ. హ్యాపీ బర్తడే వెంకీ!!
Tags:    

Similar News