వెంకీ సినిమా ఆ దర్శకుడితోనే

Update: 2017-05-17 06:18 GMT
సీనియర్ దర్శకుడు ప్రియదర్శన్ కు దేశవ్యాప్తంగా ఎంతో గుర్తింపు ఉంది. కాలా పానీ వంటి పలు కాన్సెప్ట్ చిత్రాలతో పాటు.. అన్ని జోనర్లలో సినిమాలు తీయడంలో ఎక్స్ పర్ట్ ప్రియదర్శన్. ఇప్పుడీ దర్శకుడితో మూవీ చేసేందుకు వెంకటేష్ ఉత్సాహం చూపుతున్నట్లు తెలుస్తోంది.

మోహన్ లాల్ తో గతేడాది ప్రియదర్శన్ తీసిన చిత్రం ఒప్పం. అక్కడ బ్లాక్ బస్టర్ సాధించిన ఈ మూవీని తెలుగులో కనుపాప పేరుతో అనువదించారు. ఒప్పం తెగ నచ్చేసిన వెంకీ.. తనకోసం ఓ కథ రాయమని ప్రియదర్శన్ ను అడిగాడట. ఇందుకు ఆ దర్శకుడి నుంచి సానుకూల స్పందనే లభించింది. హిందీ-తమిళ్-మలయాళ భాషల్లో పలు చిత్రాలు తీసిన ప్రియదర్శన్.. తెలుగులో బాలకృష్ణతో గాండీవం.. నాగార్జునతో నిర్ణయం చిత్రాలను మాత్రమే తెరకెక్కించాడు. మళ్లీ ఇప్పుడీ డైరెక్టర్ ను తెలుగులోకి తెచ్చేందుకు వెంకటేష్ ప్రయత్నాలు చేస్తున్నాడు.

గురు చిత్రాన్ని కొన్ని నెలల క్రితమే పూర్తి చేసిన వెంకటేష్.. ఆ తర్వాత కొత్త సినిమా కన్ఫాం చేయలేదు. క్రిష్ తో ఓ సినిమా ఖాయమైందని ప్రకటన వచ్చినా.. కథ విషయంలో కాపీరైట్ సమస్యలతో ఆగిపోయింది. ఇప్పుడు పలువురు దర్శకులు.. కథా రచయితలతో చర్చలు జరుపుతున్న వెంకటేష్.. తాజాగా ప్రియదర్శన్ తో కూడా మాటా మంతీ జరిపారు. వీరిద్దరి కాంబినేషన్ ఖాయం అయ్యే అవకాశాలున్నాయని తెలుస్తోంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News