తమిళ డబ్బింగ్ సినిమాల ప్రమోషన్ల కోసం హైదరాబాద్ కు వచ్చే ప్రతి హీరో.. ‘‘త్వరలోనే తెలుగులో సినిమా చేయబోతున్నా - కొన్ని కథలు విన్నా.. నచ్చలేదు. మంచి కథ కుదిరితే కచ్చితంగా ఇక్కడ సినిమా చేస్తా’’.. ఇలాంటి మాటలు చెబుతుంటాడు. ఐతే సిద్ధార్థ్ పరిస్థితి ఇందుకు భిన్నం. అతను తమిళుడైనా - తమిళంలోనే కెరీర్ మొదలుపెట్టినా.. అనుకోకుండా తెలుగులో హీరోగా ఎక్కువ పేరు సంపాదించి ఇక్కడే కొన్నేళ్లు గడిపాడు. ‘బాయ్స్’ తర్వాత ‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా;’ ‘బొమ్మరిల్లు’ లాంటి సినిమాలు అతణ్ని స్టార్ ను చేశాయి. కానీ తర్వాత స్థాయికి తగ్గ సినిమాలు చేయక ట్రాక్ తప్పాడు. ఉన్న ఫాలోయింగ్ అంతా పోగొట్టకున్నాడు. తర్వాత సొంతగడ్డకు వెళ్లిపోయి అక్కడే సినిమాలు చేసుకుంటున్నాడు. కెరీర్ ఏమంత గొప్పగా లేదు. అలాగని పూర్తిగా స్టార్ డమ్ కోల్పోలేదు. ఏదో ఒక రకంగా బండి నడుస్తోంది.
ఐతే కోలీవుడ్ కు వెళ్లిపోయాక తెలుగు సినిమాలు - ఇక్కడి ప్రేక్షకుల మీద సెటైర్లు వేయడం సిద్ధుకు అలవాటైపోయింది. ఒక సందర్భంలో ఇక్కడి ప్రేక్షకులు కొత్తదనాన్ని ఆహ్వానించరని.. ప్రయోగాల్ని స్వీకరించరని కామెంట్లు చేశాడతను. తాను చెత్త సినిమాలు చేసి ఫెయిల్యూర్లు ఎదుర్కొంటే నెపం మన ప్రేక్షకుల మీద నెట్టే ప్రయత్నం చేయడం విడ్డూరం. దీనిపై ‘గృహం’ ప్రమోషన్ల సందర్భంగా ప్రశ్నిస్తే విలేకరి మీద ఫైర్ అయిపోయాడతను. ఆ సంగతలా ఉంచితే ఈ మధ్య సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉన్న సిద్ధు.. మన అభిమానులపై కౌంటర్లు వేయడానికి ఏ చిన్న అవకాశం వచ్చినా వదులుకోవట్లేదు. సంక్రాంతి సినిమాల వసూళ్ల వార్ గురించి, ‘నారప్ప’ ఫస్ట్ లుక్ విషయంలో అతి చేసిన తమిళ అభిమానులతోో మన ఫ్యాన్స్ గొడవ పడ్డప్పుడు మధ్యలో దూరి కౌంటర్లు వేశాడు సిద్ధు. అలా చేసి మనవాళ్లలో వ్యతిరేకత పెంచుకున్న అతను.. ఇప్పుడేమో తెలుగు ప్రేక్షకుల కోసం ఒక కథ రాస్తున్నట్లు, త్వరలోనే ఇక్కడ సినిమా చేయబోతున్నట్లు చెప్పడం విశేషం. ఐతే ఇక్కడ మార్కెట్ అంతా దెబ్బ తినేసి, కొత్తగా వ్యతిరేకత పెంచుకున్న నేపథ్యంలో సిద్ధుకు ఇక్కడ స్వాగతం పలకడం కష్టమే.