ఇప్పుడు పవన్ కల్యాణ్ – త్రివిక్రమ్ కలిసి చేస్తున్న సినిమా నిర్మాణంలో ఉంది. ఈ సినిమా తాలూకు వివరాలు ఇప్పుడు అందరినీ ఉద్వేగానికి గురి చేసింది. సినిమాలో ఒక కీలక పాత్రలో విక్టరి వెంకటేష్ నటించబోతున్నారనే న్యూస్ ఎక్సయిట్మెంట్ కు గురిచేసింది. ఇది వరకే వీళ్ళు కలిసి గోపాల గోపాల సినిమాలో నటించారు. ఆ సినిమాలో కంటెంట్ వీళ్ళద్దరి మ్యాజిక్ బాగా వర్క్ అయ్యింది. ఇప్పుడు మళ్ళీ అదే మ్యాజిక్ చేయడానికి పవన్ కోరగా వెంకీ ఓకే చెప్పాడు. ఇంతకీ వెంకీ రోల్ ఎలా ఉండోబోతంది? ఈ ఎక్స్ క్లూజివ్ డిటైల్ మీకోసం.
అందిన ఇన్ఫో బట్టి పవన్ కల్యాణ్ మేనమామ పాత్రలో వెంకీ కనపడనున్నాడు అని అంటున్నారు. ఈ సినిమాకు ఆ పాత్ర ఆయుపట్టు లాంటిదని దానికి ఒక సూపర్ స్టార్ ఇమేజ్ ఉన్న నటుడయితే సినిమాకు చాల ప్లస్ అవుతుంది అని భావించి వెంకీ ని స్వయంగా పవన్ అడిగాడట. ఎనిమిది నిముషాలు నిడివి ఉన్న ఈ పాత్రలో సినిమాను ఒక స్థాయి నుండి వేరే స్థాయికి తీసుకువెళ్తుంది అని చెబుతున్నారు. వెంకీ ఒప్పుకోవడంతో త్రివిక్రమ్ తన మాటలు పదును మరింత పెంచాడు అని తెలుస్తుంది. పవన్ వయసు వెంకీ వయసు ఇంచుమించు దగ్గరగానే ఉంటుంది కానీ పవన్ నోరుతెరిచి అడిగేపాటికి మావ పాత్రకు కాదనలేక పోయాడట వెంకీ.
ఇదే పాత్ర కోసం మలయాళం సూపర్ స్టార్స్ మమ్మూట్టి, మోహన్ లాల్ కూడా ఆడిగినట్లు తెలిసింది. ఇప్పుడు ఈ సినిమా షూటింగ్ సారధి స్టూడియోలో జరుగుతోంది. ఇద్దరి టాప్ హీరోలు మరోసారి కలసి కనిపించడం పెద్ద విషయమే. వెంకీ ప్రయోగాలు.. పవన్ కొత్త ట్రెండ్ ఇప్పుడు తెర పై ఎలా వెలగబోతుందో వేచిచూడవలిసిందే.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/