పెద్ద సినిమాలు వచ్చి చాలా రోజులయింది. ఈమధ్య రిలీజ్ అయిన చిన్న సినిమాలేమో ప్రేక్షకులను మెప్పించలేకపోతున్నాయి. దీంతో అందరి దృష్టి వెంకటేష్ - నాగచైతన్య నటించిన మల్టిస్టారర్ 'వెంకీమామ' పైన ఉంది. ఈ సినిమా మరో నాలుగు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. విడుదలకు సమయం తక్కువగా ఉండడంతో ప్రమోషన్స్ కూడా ఊపందుకుంటున్నాయి. ఈ సినిమాకు సంబంధించిన ఇంట్రెస్టింగ్ అంశాలు కూడా ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయి.
ఈ సినిమాలో నాగ చైతన్య ఒక ఆర్మీ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్నాడనే సంగతి తెలిసిందే. ఈ సినిమాలో కాశ్మీర్ నేపథ్యంలో సాగే ఒక కీలకమైన వార్ ఎపిసోడ్ ఉందట. ఈ ఎపిసోడ్ ను పహల్ గామ్.. గుల్మార్గ్.. సోన్మార్గ్ ప్రాంతాల్లోని అద్భుతమైన ప్రదేశాలలో చిత్రీకరణ జరిపారట. ఈ లోకేషన్లలో చిత్రీకరణ జరపడం కష్టమట.. ఎందుకంటే ఈ ప్రదేశాలకు గుర్రాలపైనే ప్రయాణం చెయ్యాల్సి ఉంటుందట. ఇక షూటింగ్ చేసే సమయంలో అక్కడ మైనస్ 4.. మైనస్ 5 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రత ఉన్నప్పటికీ 'వెంకీమామ' టీమ్ మంచి అవుట్ పుట్ వచ్చేలా శ్రమించారట. ఈ ఎపిసోడ్ 'వెంకీమామ' లో ఒక హైలైట్ గా నిలుస్తుందని.. ఆడియన్స్ ను థ్రిల్ చేయడం ఖాయమని అంటున్నారు.
ఈ సినిమాలో వెంకటేష్ కు జోడీగా పాయల్ రాజ్ పుత్.. నాగచైతన్యకు జోడీగా రాశి ఖన్నా నటిస్తున్నారు. బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను సురేష్ బాబు..TG విశ్వప్రసాద్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. మరి ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఎలా ఉండబోతోందో తెలియాలంటే మనం 13 వ తేదీ వరకూ వేచి చూడాలి.