బ్ర‌హ్మీకి త‌గినోడు వ‌చ్చేసిన‌ట్లేనా?

Update: 2017-06-10 18:17 GMT
తెర మీద క‌నిపించినంత‌నే ప్రేక్ష‌కుల ముఖం మీద న‌వ్వులు పూయించేలా  చేయ‌గ‌ల క‌మెడియ‌న్లు కాస్త త‌క్కువే. ఉన్న కొద్దిమందిలో బ్ర‌హ్మీ ఒక‌రు. సినిమాకు సంబంధించిన భారం మొత్తం త‌న మీద వేసేసుకొని న‌డిపించే స‌త్తా ఆయ‌న సొంతం. అలాంటి బ్ర‌హ్మీకి స‌రైన రీప్లేస్ మెంట్ ఇప్ప‌టివ‌ర‌కూ లేద‌నే చెప్పాలి.

ద‌శాబ్దాల త‌ర‌బ‌డి బ్ర‌హ్మీకి త‌గ్గ వార‌సుడు ఎవ‌రూ తెలుగు తెర‌కు దొర‌క‌లేద‌న్న మాట ఉంది. కొద్దిమంది క‌మెడియ‌న్లు వ‌చ్చినా.. సీజ‌న‌ల్ గా ఉండ‌టం.. కొన్ని ఫార్మాట్ కామెడీకి త‌ప్పించి.. అన్నింటికి ఫిట్ కానట్లుగా ఉంటారు. ఇదంతా ఒక ఎత్తు అయితే.. కొద్దిమంది క‌మెడియ‌న్లు ప్రేక్ష‌కుల్ని బాగానే ఎంగేజ్ చేసినా.. ప‌ది సినిమాలు అయ్యేస‌రికి మోనాట‌నీ ఫీలింగ్ క‌లిగేలా చేయ‌టంతో బ్ర‌హ్మీకి వార‌సుడు లేద‌న్న మాట వినిపించేది.

బ్ర‌హ్మీకి కాస్తో కూస్తో వార‌సుడన్న మాట‌ను సునీల్ సొంతం చేసుకున్నాడు. అయితే.. అత‌గాడు హీరోగా మూవ్ కావ‌టంతో స‌రైన క‌మెడియ‌న్ లేర‌న్న కొర‌త వినిపించేది. అయితే.. ఇప్పుడా కొర‌త‌ను తీర్చే క‌మెడియ‌న్ దొరికిన‌ట్లుగా చెబుతున్నారు.

అమీతుమీ సినిమాలో హీరో పాత్ర కంటే.. క‌మెడియ‌న్ పాత్రే ఎక్కువ‌గా ఉండ‌ట‌మే కాదు.. త‌న టైమింగ్ కామెడీతో ప్రేక్ష‌కుల్ని సీట్ల‌లో ఓ ప‌ట్టాన కూర్చోకుండా చేయ‌టంలో వెన్నెల కిషోర్ స‌క్సెస్ అయ్యార‌ని చెప్పాలి. ఈ సినిమాలో వెన్నెల కిషోర్ పేరుకు క‌మెడియ‌న్ అయిన‌ప్ప‌టికీ.. సినిమా మొత్తాన్ని త‌న భుజాన వేసుకొని న‌డిపించార‌న్న మాట ప్రేక్ష‌కుల నోట వినిపిస్తోంది.

శ్రీచిలిపి క్యారెక్ట‌ర్‌ కు ప్రాణం పోయ‌ట‌మే కాదు.. ప్రేక్ష‌కుల మ‌దిలో క‌ల‌కాలం గుర్తుండిపోయేలా చేయ‌టంలో వెన్నెల కిషోర్ స‌క్సెస్ అయిన‌ట్లుగా చెప్పాలి. ఈ సినిమాలో వెన్నెల కిషోర్ కు బ‌దులుగా మ‌రెవ‌రు ఈ పాత్ర‌ను చేసినా ఇంత ఎఫెక్ట్ ఉండేది కాద‌న్న మాట వినిపిస్తోంది.

అమీతుమీతో  వెన్నెల కిషోర్ స‌రికొత్త క్రేజ్‌ ను సొంతం చేసుకోవ‌ట‌మే కాదు.. ఇంత‌కాలంగా బ్ర‌హ్మానందానికి స‌రైన రీప్లేస్ మెంట్ లేద‌న్న లోటును తీర్చేశార‌న్న మాట వినిపిస్తోంది. చిన్న సినిమాలో త‌న స‌త్తాను చాటిన వెన్నెల కిషోర్‌.. పెద్ద సినిమాలో కూడా వెన్నెల కిషోర్ కానీ త‌న స‌త్తాను ప్రూవ్ చేసుకుంటే.. తిరుగు ఉండ‌ద‌ని చెబుతున్నారు. విమ‌ర్శ‌కుల మ‌నసుల్ని గెలుచుకున్న వెన్నెల కిషోర్ కు అమీతుమీ చ‌క్క‌టి బ్రేక్ అని చెప్ప‌క త‌ప్ప‌దు.


Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News