సంక్రాంతికి ఎఫ్2 బ్లాక్ బస్టర్ సక్సెస్ తర్వాత ఆ స్థాయి సినిమా లేక బాక్స్ ఆఫీస్ వెలవెలబోతోంది. నెల రోజులు దాటినా ఇంకా ఆ సినిమానే కొద్దో గొప్పో స్టడీగా ఉందంటేనే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. అఖిల్ మిస్టర్ మజ్ను భయపడినట్టే టపా కట్టేసింది. యాత్రకు చాలా మంచి స్పందన దక్కినప్పటికీ భారీ వసూళ్లు రాబట్టడం లేదు. కాని నిర్మాతలు బయ్యర్లు సేఫ్ గేమ్ ఆడటంతో నష్టాలు రావనే క్లారిటీ అయితే వచ్చేసింది. అయితే మొన్న శుక్రవారం కేవలం రెండు డబ్బింగ్ సినిమాలు మాత్రమే విడుదల కావడం టికెట్ కౌంటర్లను ఇంకా నీరస పరిచింది.
కార్తి దేవ్ ఉదయం ఆట పూర్తవ్వడం ఆలస్యం ప్రేక్షకులతో దండం పెట్టించుకుంది. లోపాన్ని గుర్తించిన నిర్మాతలు ఓ పావు గంట కత్తిరింపు వేసినా అసలు విషయమే లేని దేవ్ ని ఎన్ని రిపేర్లు చేసినా ఆడే అవకాశం లేదని తేలిపోయింది. సుమారు 6 కోట్ల దాకా థియేట్రికల్ బిజినెస్ జరుపుకున్న దేవ్ అందులో పాతిక శాతం రాబడితేనే గొప్ప అంటున్నారు.
ఇక కన్నుగీటు సుందరి ప్రియా ప్రకాష్ వారియర్ వైరల్ వీడియో క్రేజ్ ను చూపించి బిజినెస్ చేసుకున్న లవర్స్ డే అంత కంటే దారుణమైన పరిస్థితిని ఎదురుకుంటోంది. ఏదో ప్రేమ పక్షుల వల్ల వాలెంటైన్ డే రోజు ఓ రెండు ఆటలు బాగానే నడిచినా టాక్ గురించి వంద శాతం నెగటివ్ ఒపీనియన్ రావడంతో చూడని వాళ్ళు హాల్ వైపు వెళ్ళే సాహసం చేయడం లేదు.
సో మొత్తంగా చూసుకుంటే ఫిబ్రవరిలో ఇప్పటిదాకా పాస్ అయిన సినిమా యాత్ర ఒక్కటే. కొత్త ఏడాదిలో నెలన్నర కాలాన్ని లేక్కేసుకుంటే ఎఫ్2 ఒక్కటే ఫైనల్ విన్నర్ గా నిలిచింది. అసలే కొంత డ్రై సీజన్. అందులోనూ ఒక మంచి శుక్రవారాన్ని మన నిర్మాతలు ఏ స్ట్రెయిట్ మూవీ రిలీజ్ చేయకుండా వదిలేసారు. ఫలితంగా వెరీ వెరీ బ్యాడ్ ఫ్రైడేగా ఫిబ్రవరి 14 నిలిచిపోయింది. ప్రేమికుల రోజును వృధా చేసుకుంది.