ఈమద్య కాలంలో మల్టీ స్టారర్ సినిమాలకు మంచి డిమాండ్ ఉంటుంది. అన్ని భాషల్లో కూడా వరుసగా మల్టీ స్టారర్ సినిమాలు వస్తున్న నేపథ్యంలో త్వరలో తమిళంలో కూడా ఒక భారీ మల్టీ స్టారర్ రాబోతుంది అంటూ గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. తమిళ సూపర్ స్టార్ లుగా గుర్తింపు దక్కించుకున్న విజయ్ మరియు అజిత్ ల కాంబోలో మల్టీ స్టారర్ రాబోతుందనే వార్తలకు క్లారిటీ వచ్చింది.
ప్రముఖ దర్శకుడు వీరిద్దరి మల్టీ స్టారర్ సినిమాకు ఏర్పాట్లు చేస్తున్నాడని.. త్వరలోనే సినిమా ను పట్టాలెక్కించబోతున్నాడు.. స్క్రిప్ట్ వర్క్ కూడా చేస్తున్నాడంటూ తమిళ మీడియా ల్లో కథనాలు వచ్చాయి.
ఆ ప్రముఖ దర్శకుడు ఇద్దరు హీరోలకు కథను వినిపించి ఓకే చెప్పించాడని.. త్వరలోనే స్క్రిప్ట్ వర్క్ పూర్తి చేసి వచ్చే ఏడాది ఆరంభం నుండి షూటింగ్ ను మొదలు పెట్టబోతున్నట్లుగా ప్రచారం జరిగింది.
తాజాగా తమిళ సినీ ఇండస్ట్రీ వర్గాల నుండి మరియు విజయ్ ఇంకా అజిత్ సన్నిహితుల నుండి స్పందన వచ్చింది. అసలు ఇప్పటి వరకు అలాంటి ఒక మల్టీ స్టారర్ గురించి చర్చ జరగలేదని పేర్కొన్నారు. ఇప్పటి వరకు ఆ ఇద్దరు స్టార్ లతో మల్టీ స్టారర్ కు సంబంధించి ఏ ఒక్కరు కూడా చర్చలు జరపడం లేదంటే సంప్రదింపులు జరపడం చేయలేదు అంటూ క్లారిటీ ఇచ్చారు.
ప్రస్తుతం సూపర్ స్టార్ విజయ్ తెలుగు లో ఒక సినిమాను చేస్తున్న విషయం తెల్సిందే. ఆ సినిమాను తెలుగు తో పాటు తమిళంలో కూడా విడుదల చేయబోతున్న విషయం తెల్సిందే. భారీ అంచనాల నడుమ రూపొందుతున్న ఈ సినిమా కు వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తుండగా దిల్ రాజు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న విషయం తెల్సిందే.
ఇక అజిత్ సినిమా విషయానికి వస్తే ఇటీవలే ఆయన వాలిమై సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఆ సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకోవడంతో తదుపరి సినిమా కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. విడి విడిగా వీరిద్దరు బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. కాని వీరిద్దరి కాంబోలో మాత్రం సినిమా వచ్చే అవకాశం ప్రస్తుతానికి లేదని క్లారిటీ వచ్చింది.