‘బిచ్చగాడు’ సినిమాతో తెలుగులో అనూహ్యమైన ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు తమిళ హీరో విజయ్ ఆంటోనీ. ఈ సినిమా తర్వాత అతను చేసిన ‘బేతాళుడు’ అంచనాల్ని అందుకోలేకపోయినా మంచి ఓపెనింగ్స్ సాధించింది. దీని తర్వాత విజయ్ ఆంటోనీ నటించిన ‘యమన్’ కూడా ప్రేక్షకుల్లో బాగానే ఆసక్తి రేకెత్తిస్తోంది. ఈ చిత్రం ఈ నెలలోనే మహాశివరాత్రి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. శనివారం ఆడియో విడుదల చేసి.. థియేట్రికల్ ట్రైలర్ కూడా లాంచ్ చేశారు. విజయ్ ఆంటోనీ ఇంతకుముందు చేసిన సినిమాలన్నింటికీ ఇది భిన్నమైన చిత్రంలా కనిపిస్తోంది ట్రైలర్ చూస్తుంటే.
తాను చేయని నేరానికి జైల్లోకి వచ్చిన హీరో.. అక్కడి నుంచి బయటపడ్డాక తనను ఇరికించిన వాళ్లను దెబ్బ కొట్టడానికి రాజకీయాల మీద దృష్టిపెడతాడు. మరోవైపు శత్రు వర్గం అతణ్ని తొక్కడానికి పన్నాగాలు పన్నుతుంది. ఈ పోరులో హీరో ఎలా గెలిచాడన్నది ఈ చిత్ర కథ. విజయ్ ఆంటోనీ హీరోగా నటించిన తొలి సినిమా ‘నాన్’ (తెలుగులో నకిలీ)కు దర్శకత్వం వహించిన జీవాశంకర్ ‘యమన్’ను రూపొందించాడు. రజినీకాంత్-శంకర్ కాంబినేషన్లో ‘2.0’ లాంటి మెగా సినిమాను నిర్మిస్తున్న లైకా ప్రొడక్షన్ ప్రొడక్షన్లో ఈ చిత్రం తెరకెక్కింది. తెలుగులో మిర్యాల రవీంద్ర రెడ్డి ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నాడు. ఈ నెల 24న ‘యమన్’ తమిళ.. తెలుగు భాషల్లో రిలీజవుతుంది.
Full View