విజయ్ దేవరకొండ టాలీవుడ్ మోస్ట్ క్రేజీ హీరోగా మారిపోయాడు. యూత్ ఐకాన్ గా గురించిపు దక్కించుకున్న విజయ్ దేవరకొండ అప్పుడే బ్రాండ్ అంబాసిడర్ గా కూడా వ్యవహరిస్తున్నాడు. పలు బ్రాండ్స్ కు అంబాసిడర్ గా వ్యవహరిస్తున్న విజయ్ తాజాగా సిగ్నేచర్ బ్రాండ్ కు అంబాసిడర్ గా ఎన్నికయ్యాడు. విజయ్ సిగ్నేచర్ యాడ్స్ ప్రస్తుతం బుల్లి తెరను షేక్ చేస్తున్నాయి. ఇక సిగ్నేచర్ మాస్టర్ క్లాస్ సీజన్ 3 కార్యక్రమంలో విజయ్ దేవరకొండ పాల్గొన్నాడు. ఆ సందర్బంగా పలు ఆసక్తికర విషయాలను విజయ్ దేవరకొండ వెళ్లడించాడు.
ఆ కార్యక్రమంలో పలు ప్రశ్నలకు సమాధానాలు చెప్పిన విజయ్ దేవరకొండ కొత్త దర్శకులను ఎంకరేజ్ చేసే విషయంలో ముందుంటారు కదా అంటూ ఎదురైనా ప్రశ్నకు తనదైన శైలిలో సమాధానం ఇచ్చాడు. నేను కొత్త వారిని ఎంకరేజ్ చేయడం ఏంటీ, వారిలో ఉన్న అద్బుతమైన ట్యాలెంట్ వల్లే తాను ప్రస్తుతం ఈ స్టేజ్ లో ఉన్నట్లుగా చెప్పుకొచ్చాడు. తాను వర్క్ చేసిన 'ట్యాక్సీవాలా' చిత్ర దర్శకుడు మరియు ప్రస్తుతం నేను చేస్తున్న డియర్ కామ్రెడ్ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్న దర్శకుడు ఇలా నాకు దొరికిన ప్రతి దర్శకుడు కూడా మంచి టెక్నీషియన్ అని, వారు నాకు లభించడం అదృష్టం అంటూ విజయ్ చెప్పుకొచ్చాడు.
పెళ్లి చూపులు చిత్రంతో విజయ్ దేవరకొండకు తరుణ్ భాస్కర్ మొదటి విజయాన్ని అందించాడు. ఆ తర్వాత అర్జున్ రెడ్డి సినిమాతో సందీప్ రెడ్డి వంగ కూడా విజయ్ దేవరకొండకు మంచి సక్సెస్ ఇచ్చాడు. ఇలా విజయ్ దేవరకొండ చేసిన పలు చిత్రాలకు దర్శకులు కొత్త వారే. త్వరలో క్రాంతి మాధవ్ దర్శకత్వంలో ఒక చిత్రం చేయబోతున్న విజయ్ దేవరకొండ ఆ తర్వాత కూడా మరో కొత్త దర్శకుడితో సినిమా చేయబోతున్నట్లుగా ప్రకటించాడు. కొత్త వారు తనకు అదృష్టాన్ని తెచ్చి పెడుతున్నారని, వారిని నేను ఛాన్స్ ఇవ్వడం కాదు, వారే నాకు మంచి సినిమాలిస్తున్నారంటూ విజయ్ తనదైన శైలిలో స్పందించాడు.