టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ మరోసారి తన పెద్ద మనసును చాటుకున్నాడు. క్రిస్మస్ పండగ సందర్భంగా పలు అనాథాశ్రమాల్లో ఉన్న ఎంతో మంది పిల్లలకు దుస్తులు, బహుమతులు అందజేశాడు. ‘దేవర-శాంతా’ పేరుతో క్రిస్మస్ వేడుకలు జరుపుకొని, స్వయంగా చిన్నారులకు వద్దకు వెళ్లి బహుతులు అందజేస్తుంటాడు విజయ్.
అయితే.. ఈ సారి కరోనా వైరస్ ప్రభావం నేపథ్యంలో తన సిబ్బందితో వీటిని పంపించాడు. కొవిడ్ నియమ నిబంధనలు పాటిస్తూ పిల్లల వద్దకు బహుమతులు పంపించాడు. అంతేకాకుండా.. వీడియో కాన్ఫెరెన్స్ ద్వారా ఆ చిన్నారులతో మాట్లాడాడు. వాళ్లకి ఏం కావాలో తెలుసకొని, చిన్నాారుల్లో ఆనందం నింపాడు విజయ్. తనపై ప్రేక్షకులు ప్రేమను చూపడం వల్లే తనకు సక్సెస్ వచ్చిందన్న దేవరకొండ.. తిరిగి అందరికీ ఆ ప్రేమను పంచాలనుకుంటున్నానని చెప్పాడు.
ఈ క్రిస్మస్ వేడుకల సందర్భంగా మొత్తం 7 ఆశ్రమాల్లోని 600 మందికిపైగా పిల్లలకు బహుతులు పంపించిన విజయ్ దేవరకొండ.. మరో వెయ్యి మందికి పంపించాలనుకుంటున్నానని చెప్పాడు. పిల్లలకు ఎక్కడైనా క్లాత్స్ కావాలనుకుంటే తనను సంప్రదించాలని ట్విటర్ వేదిక కోరాడు. #DeveraSanta హ్యాష్ ట్యాగ్‌తో ట్వీట్ చేస్తే ఆ అడ్రస్‌కి గిఫ్ట్‌లు పంపిస్తానని విజయ్ తెలిపాడు.