విజయ్.. ఏంటీ ఈ క్రేజ్?
ప్రస్తుతం టాలీవుడ్ లో మోస్ వాంటెడ్, యూత్ ఐకాన్ హీరో అంటే ఠక్కున అందరు చెప్పే పేరు విజయ్ దేవరకొండ. అర్జున్ రెడ్డి - గీత గోవిందం చిత్రాలతో ఓవర్ నైట్ స్టార్ అయిన విజయ్ దేవరకొండ తాజాగా ‘నోటా’తో ఫ్లాప్ చవిచూసినా కూడా ఆయన క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. సినిమా సినిమాకు క్రేజ్ ను పెంచుకుంటూనే పోతున్న విజయ్ దేవరకొండ త్వరలో ‘ట్యాక్సీవాలా’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ట్యాక్సీవాలా విడుదలకు సిద్దంగా ఉన్న ఈ సమయంలోనే నాగచైతన్య హీరోగా నటించిన ‘సవ్యసాచి’ చిత్రం ప్రీ రిలీజ్ వేడుకలో పాల్గొన్నాడు.
‘సవ్యసాచి’ వేడుకలో పాల్గొన్న విజయ్ దేవరకొండ క్రేజ్ ను చూసి అంతా కూడా షాక్ అవుతున్నారు. విజయ్ దేవరకొండ కార్యక్రమ వెన్యూకు చేరిన వెంటనే పెద్ద ఎత్తున జనాలు కేకలు వేయడంతో యాంకర్ సుమతో పాటు ఇతర చిత్ర యూనిట్ సభ్యులు కూడా అవాక్కయ్యారు. గతంలో పవన్ కళ్యాణ్ హాజరైన కార్యక్రమాలకు జనాలు గెస్ట్ లను మాట్లాడకుండా మొత్తుకునేవారు. తాజాగా నిన్నటి కార్యక్రమంలో కూడా సినిమా గురించి కీరవాణి మాట్లాడుతూ ఉంటే జనాలు విజయ్ దేవరకొండ అంటూ కేకలు పెట్టడం జరిగింది. దాంతో కీరవాణి హాయ్ విజయ్ దేవరకొండ అంటూ పలకరించి, ఆయన అభిమానులను కాస్త చల్లారి - ఆ తర్వాత మాట్లాడాడు.
తన ఫంక్షన్ లోనే కాకుండా - ఇతర హీరోల ఫంక్షన్ కు హాజరు అయిన సమయంలో ఇంతటి ఆధరణ ఏ ఇతర చిన్న హీరోలకు లేదని చెప్పుకోవచ్చు. విజయ్ దేవరకొండ అంటే ప్రస్తుతం యూత్ లో ఎంతటి క్రేజ్ ఉందో మరోసారి ఈ సంఘటన నిరూపించింది. విజయ్ దేవరకొండ క్రేజ్ ను చూసి తోటి యువ హీరోలు కూడా అసూయ పడుతూ ఉంటారు.