చెప్పిన తేదీకి ముందే రానున్న కామ్రేడ్‌

Update: 2019-02-28 11:15 GMT
విజయ్‌ దేవరకొండ ప్రస్తుతం టాలీవుడ్‌ సెన్షేషన్‌ అనడంలో ఎలాంటి సందేహం లేదు. విభిన్నమైన బాడీలాంగ్వేజ్‌, యాటిట్యూడ్‌ తో యూత్‌ ఆడియన్స్‌ లో పిచ్చ క్రేజ్‌ సంపాధించిన విజయ్‌ దేవరకొండ ప్రస్తుతం భరత్‌ కమ్మ దర్శకత్వంలో 'డియర్‌ కామ్రేడ్‌' చిత్రంలో నటిస్తున్న విషయం తెల్సిందే. భారీ అంచనాల నడుమ రూపొందుతున్న ఈ చిత్రంను జూన్‌ లో విడుదల చేయాలని మొదట భావించారు. అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ముందే చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకు రావాలని నిర్ణయించినట్లుగా తెలుస్తోంది.

షూటింగ్‌ అనుకున్నదానికంటే ముందే పూర్తి అవ్వనున్న నేపథ్యంలో ఆలస్యం చేయకుండా మేలోనే సినిమాను విడుదల చేయాలని భావిస్తున్నారు. షూటింగ్‌ ప్రస్తుతం చివరి దశలో ఉన్న ఈ చిత్రం నుండి ఫస్ట్‌ లుక్‌ ను విడుదల చేయనున్నట్లుగా సమాచారం అందుతోంది. టీజర్‌ విడుదలతో సినిమాపై అంచనాలు పెంచేలా యూనిట్‌ సభ్యులు ప్రయత్నాలు చేస్తున్నాడు. విభిన్నమైన కథాంశంతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లుగా సినీ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది.

జూన్‌ లో వేసవి సెలవులు ముగియనున్నాయి. ఆ కారణంగానే మేలోనే వేసవి కానుకగా సినిమాను విడుదల చేస్తే అన్ని విధాలుగా బాగుంటుందనే అభిప్రాయంతో డియర్‌ కామ్రేడ్‌ యూనిట్‌ సభ్యులు ఉన్నారు. అతి త్వరలోనే సినిమాకు సంబంధించిన విడుదల తేదీపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతానికి అయితే మే 25న చిత్రాన్ని విడుదల చేయబోతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఫస్ట్‌ లుక్‌ తో పాటు సినిమా విడుదల తేదీపై క్లారిటీ ఇవ్వనున్నారు. ఈ చిత్రంను పూర్తి చేసి క్రాంతి మాధవ్‌ దర్శకత్వంలో ఒక చిత్రాన్ని విజయ్‌ దేవరకొండ చేయబోతున్న విషయం తెల్సిందే. ఆ సినిమాను కేఎస్‌ రామారావు నిర్మించనుండగా, నలుగురు ముద్దుగుమ్మలు ఆ సినిమాలో ఉండబోతున్నారు. ఆ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
Tags:    

Similar News