వెండితెర మీద వెలిగిపోయే స్టార్ ను చూసి మనసు పారేసుకోవటం కామన్. అలా తమను చూసి విపరీతంగా ఊగిపోయే వారిని ఫ్యాన్స్ పేరుతో స్టార్లు పిలుచుకోవటం.. వారే తమ బలమని.. వారి కోసం తాము ఏమైనా చేస్తామని తరచూ చెబుతుంటారు. ఇప్పటివరకూ ఏ స్టార్.. తనను విపరీతంగా అభిమానించే వారి కోసం చేసిందేమైనా ఉందంటే.. అలాంటివి వేళ్ల మీద లెక్క పెట్టొచ్చు.
ఏ స్టార్ కూడా తన సినిమా కోసం ఉరుకులు పరుగులు తీయొద్దని.. థియేటర్ల దగ్గర హాల్ సిబ్బంది చేతుల్లో బూతులు తిట్టించుకోవద్దని.. కర్ర దెబ్బలు తినొద్దని.. బ్లాక్ లో టికెట్ కొని సినిమాలు చూడొద్దని.. మొదటిరోజు తన సినిమా కోసం పిచ్చి పట్టినట్లుగా పని ఆపుకొని మరీ చూడొద్దని చెప్పినోళ్లు ఉన్నారా? లేరనే చెబుతారు.
అలా చెబితే.. సినిమా చూసేదెవరు? కలెక్షన్లు తెచ్చేది ఎవరన్న ప్రశ్న వేయొచ్చు. సరే.. దాన్ని వదిలేద్దాం. ఫ్యాన్స్.. ఫ్యాన్స్ అంటూ చెప్పే బదులు.. వారేంటి ఫ్యాన్సే ఏంది? వాళ్లంతా నా ప్రేమికులు.. ఫ్రెండ్స్.. ఫ్యామిలీ మెంబర్స్ అన్న మాటనైనా చెప్పినోళ్లు ఉన్నారా? అంటే.. అలా కూడా కనిపించరు.
కానీ.. ఇప్పుడా కొరత తీరిపోయినట్లే. ఎందుకంటే.. ఫ్యాన్ అనే పదం విన్నంతనే ఇబ్బందిగా అనిపిస్తుంది. ఎందుకంటే.. నన్ను ఇష్టపడేవాళ్లంతా దాదాపుగా నా వయసు వాళ్లే.. ఓ విధంగా వాళ్లంతా నా ఫ్రెండ్స్.. అలాంటి స్నేహితుల్ని ఫ్యాన్స్ అని పిలవటం ఏంటి? అంటూ ప్రశ్నిస్తున్న విజయ్ దేవరకొండ మాటలు ఇప్పుడు ఆసక్తికరంగానే కాదు.. సరికొత్తగా ఉన్నాయని చెప్పాలి.
ఇంతకాలం ఫ్యాన్స్ పేరు పెట్టేసి.. ఇష్టారాజ్యంగా వాడేసిన స్టార్లకు భిన్నంగా.. తమను అభిమానించే వాళ్లంతా తన స్నేహితులే తప్పించి.. ఫ్యాన్స్ ఎంత మాత్రం కాదంటూ చెప్పిన రియల్ గోవిందుడి మాటలు ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి. ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఫ్యాన్స్ కు సంబంధించి అతగాడి ఐడియాలజీ కొత్తగా ఉందనిపించక మానదు.
ఇంతకీ ఫ్యాన్స్ మీద ఏం చెప్పాడన్నది అతడి మాటల్లోనే చూస్తే.. "ఫ్యాన్’ అనే పదంతో ఇబ్బంది అనిపిస్తుంది. నేనంటే ఇష్టపడేవాళ్లంతా దాదాపుగా నా వయసువాళ్లే. ఓ విధంగా వాళ్లంతా నా ఫ్రెండ్స్. అలాంటి స్నేహితుల్ని ఫ్యాన్స్ అని పిలవడం ఏమిటి? అందుకే తొలి రోజుల్లో ‘మై లవ్స్ - బోయ్స్ అండ్ గాళ్స్’ అని పిలిచేవాడ్ని.
"నన్ను ఇంతగా అభిమానిస్తున్నారంటే కారణం.. నా మాటతీరు - నా ప్రవర్తన. ఇలా మాట్లాడకూడదు - ఇలాంటి దుస్తులు వేసుకోకూడదు’ అనే మాటలు నాకు నచ్చవు. నేనెప్పుడూ పద్ధతి మీరలేదు. అలాగని నా ఇష్టాయిష్టాల్ని వదులుకోను. ఇష్టమొచ్చింది చేయడం - నచ్చినట్టు బతకడం - కోరుకున్నది గెలవడం కోసం పోరాడడం.. ఇదే నా స్వభావం. ఇలాంటి ఆటిట్యూడ్ నాకు వర్కవుట్ అయ్యింది"
" అదే విషయాన్ని నన్ను అభిమానించే వాళ్లకూ చెప్పాలనుకున్నా. పుస్తకాలు చదివితే మనుషుల్లో - ఆలోచనల్లో మార్పు వస్తుంది. కానీ... అలా పుస్తకాలు చదివేంత ఓపిక - తీరిక చాలా మందికి లేకపోవొచ్చు. నన్ను - నా మాటలు చూసి ఇద్దరు ముగ్గురు మారినా సంతోషిస్తా" అని చెప్పుకొచ్చాడు.
అంతేనా.. మరికొన్ని ఆసక్తికర వ్యాఖ్యల్ని చూస్తే..
+ "తప్పులు చేయాలి.. అందులోంచి పాఠాలు నేర్చుకోవాలి. అలాగని తప్పులన్నీ మనమే చేయాలని కాదు. కొన్ని పాఠాలు.. స్నేహాలు - ఇంకొన్ని పాఠాలు పుస్తకాలు నేర్పుతాయి. ఓ పుస్తకం చదివితే ఐదేళ్లకు సరిపడా తప్పులు - వాటి తాలూకు పాఠాలు అందులో కనిపిస్తుంటాయి. అందుకే విరివిగా చదివేవాడ్ని"
+ "వ్యక్తిత్వ వికాస పుస్తకాలన్నీ దాదాపుగా తిరగేశా. ‘ఏడు అలవాట్లు’ - ‘రిచ్ డాడ్ పూర్ డాడ్’.. ఇలా దాదాపుగా ప్రతీ మంచి పుస్తకం చదివేశా. దీపక్ చోప్రా - చేతన్ భగత్ వీళ్ల రచనల్ని ఫాలో అయ్యా. క్రైమ్ స్టోరీల్నీ బాగా ఇష్టపడతా"
+ ‘సీక్రెట్’ అనే పుస్తకం గురించి నా స్నేహితులంతా గొప్పగా చెబితే చదివా. నాకైతే అదంతా ట్రాష్ అనిపించింది. ‘మనం బలంగా ఏదైతే కోరుకుంటామో అది మన వెంట వస్తుంది’ అని చెప్పారందులో. బలంగా కోరుకుంటే ఏం జరగవు. నానా కష్టాలూ పడితే జరుగుతాయి. ఈ విషయమై నా స్నేహితులతో చాలా గట్టిగా వాదించా"
+ "ఇంటర్మీడియట్ లో తొలిసారి కో ఎడ్యుకేషన్ అనుభవానికొచ్చింది. కొత్త కాలేజీ - కొత్త స్నేహాలు.. థ్రిల్లింగ్ గా అనిపించేది. వాళ్లని ఇంప్రెస్ చేయాలంటే వేసుకునే దుస్తులు బాగుండాలి అనుకునేవాడ్ని. పదో తరగతి వరకూ స్కూల్ యూనిఫామ్ లోనే ఉండడం వల్ల డ్రస్సింగ్ స్టైల్ గురించి పెద్దగా అవగాహన ఉండేది కాదు. నచ్చిన కాంబినేషన్ లో దుస్తుల్ని కొనేవాడ్ని"
+ "మెల్లమెల్లగా వాటిపై ఓ అభిరుచి ఏర్పడడం మొదలైంది. విదేశాలకు వెళ్లినప్పుడు వాళ్ల డ్రసింగ్ స్టైల్ - కలర్ సెన్స్ బాగా నచ్చేది. అలా నేనున్న సిటీ అంతా - నాకు నచ్చిన దుస్తుల్ని వేసుకుని తిరిగితే ఎలా ఉంటుందనిపించింది. ఆ ఆలోచనల్లోంచి పుట్టిందే ‘రౌడీ’ బ్రాండింగ్. ఇద్దరు స్నేహితులతో ఈ వ్యాపారం మొదలెట్టా. తిరుపూర్ - నార్త్ ఇండియా - చైనా - బంగ్లాదేశ్ నుంచి వస్త్రాల్ని తీసుకొస్తున్నాం. ప్రతీ బుధవారం ఓ కొత్త బ్రాండ్ ని పరిచయం చేస్తున్నాం. నలభై నిమిషాల్లోనే స్టాక్ మొత్తం అయిపోతోంది. భవిష్యత్తులో ఈ వ్యాపారాన్ని మరింత ముందుకు తీసుకెళ్దామనుకుంటున్నా"