#రౌడీ షేప్‌! షాక్ కి గురి చేస్తున్న దేవ‌ర‌కొండ‌!

Update: 2021-12-16 14:30 GMT
తీరైర రూపంతో మ‌గువ‌ల గుండెల్లో మారాజులా మారాల‌న్న త‌ప‌న యూత్ లో అంత‌కంత‌కు పెరుగుతోంది. ప‌ర్య‌వ‌సానంగా జిమ్ కి వెళ్లి నిరంత‌రం కండ‌లు పెంచే ప‌నిలో ఉంటున్నారు. సెల‌బ్రిటీల‌తో పాటు సామాన్యులు కూడా అవ‌కాశాన్ని బ‌ట్టి జిమ్ కి వెళుతూ మ‌జిల్స్ ని పెంచేందుకు ప్ర‌య‌త్నిస్తున్నారు. ప‌ట్టుద‌ల‌తో ఏదైనా సాధ్య‌మేన‌ని నిరూపిస్తున్నారు.

ఇక‌పోతే ఇటీవ‌లి కాలంలో టాలీవుడ్ హీరోలు ఒక‌రితో ఒక‌రు పోటీప‌డుతూ టోన్డ్ బాడీని ప‌ర్ఫెక్ట్ మ‌జిల్స్ ని తీర్చిదిద్దుతున్న తీరు ఆశ్చ‌ర్య‌ప‌రుస్తోంది. యంగ్ హీరోల్లో నాగ‌శౌర్య‌.. రామ్ లాంటి వాళ్లు ఇటీవ‌ల అద్భుత‌మైన మేకోవ‌ర్ తో అల‌రించారు. ఇప్పుడు అదే బాట‌లో రౌడీ విజ‌య్ దేవ‌ర‌కొండ కూడా త‌న బాడీ ని షేప‌ప్ చేసిన తీరు స‌ర్వ‌త్రా చ‌ర్చ‌కు తావిస్తోంది.

విజయ్ దేవరకొండ తన తొలి పాన్-ఇండియా చిత్రం `లైగర్` కోసం అసాధార‌ణ హార్డ్ వ‌ర్క్ చేస్తున్నాడు. ఈ చిత్రంలో విజ‌య్ బాక్సర్ పాత్రలో కనిపిస్తాడు. త‌న పాత్ర‌కు త‌గ్గ‌ట్టే రూపాన్ని మార్చేందుకు తీవ్రంగానే శ్ర‌మించాడు. కోచ్ స‌మ‌క్షంలో క‌ఠిన‌మైన వ్యాయామాల‌తో త‌న దేహాన్ని తీరుగ్గా తీర్చిదిద్దాడు. ఇప్ప‌టికే జిమ్ లో వ‌ర్క‌వుట్లు చేస్తున్న ఫోటోల్ని విజ‌య్ షేర్ చేసాడు. తాజాగా మ‌రో అరుదైన ఫోటోని రివీల్ చేశాడు.

ఇందులో విజయ్ ప‌ర్ఫెక్ట్ ఫిజిక్ తో క‌నిపించాడు. అత‌డి బైసెప్స్ ట్రైసెప్స్ స‌హా షోల్డ‌ర్ బాడీని తీర్చిదిద్దిన తీరు షాక్ కి గురి చేస్తోంది. తాజా లుక్ లో విజ‌య్ 6-ప్యాక్ అవ‌తారం ఎంతో ఆక‌ర్ష‌ణీయంగా క‌నిపిస్తోంది. కండ‌రాలు పొంగించేందుకు విజ‌య్ ఎంత‌గా శ్ర‌మిస్తున్నాడో ఈ లుక్ చెప్ప‌క‌నే చెబుతోంది. పాన్ ఇండియా మూవీ లైగ‌ర్ ప్రపంచవ్యాప్తంగా థియేటర్ లలో 25 ఆగస్టు 2022న విడుదల కానుంది.

డిసెంబర్ 31న స్పెష‌ల్ ట్రీట్ కోసం ప్లాన్ చేస్తున్నామ‌ని టీమ్ ప్ర‌క‌టించింది. ఈ నూతన సంవత్సరం.. ఆగ్ లగా డెంగే..`` అంటూ నిర్మాతలు ఇంత‌కుముందే జోష్ పెంచారు. బాక్సింగ్ లెజెండ్ మైక్ టైసన్ తో చిత్రీక‌ర‌ణ‌ను ముగించిన తర్వాత ఇటీవల US షెడ్యూల్ నుండి తిరిగి వచ్చిన సంగ‌తి తెలిసిందే.


Tags:    

Similar News