'దొరసాని' వేడుకలో రౌడీ

Update: 2019-07-07 10:51 GMT
విజయ్‌ దేవరకొండ తమ్ముడు ఆనంద్‌ దేవరకొండ హీరోగా జీవిత రాజశేఖర్‌ చిన్న కుమార్తె శివాత్మిక హీరోయిన్‌గా రూపొందిన 'దొరసాని' చిత్రం విడుదలకు సిద్దం అయ్యింది. ఈ వారంలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న దొరసాని చిత్రం ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ ను నేడు హైదరాబాద్‌ లో నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. ఈ వేడుకలో విజయ్‌ దేవరకొండ మరియు జీవిత రాజశేఖర్‌ లు ముఖ్య అతిథులుగా పాల్గొనబోతున్నారు.

తమ్ముడు సినిమా ప్రమోషన్‌ వేడుకలో హీరోలైన అన్నయ్యలు పాల్గొనడం చాలా కామన్‌ గా చూస్తూనే ఉన్నాం. అయితే విజయ్‌ దేవరకొండ తమ్ముడి ఎంట్రీ గురించి ఏమంటాడు.. తమ్ముడిని ఆధరించమని అభిమానులను కోరతాడా లేదంటే సినిమా నచ్చితే చూడమంటాడా చూడాలి. ఇక తమ్ముడితో తనకు ఉన్న అనుబంధం గురించి విజయ్‌ ఏమని చెప్తాడో అని కూడా అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

ఆనంద్‌ దేవరకొండ అన్నను ఫాలో అయ్యి ఈ చిత్రంలో నటించాడా లేదంటే తనకంటూ ఒక ప్రత్యేక శైలిని ఏర్పర్చుకున్నాడా అనేది సినిమా విడుదలైన తర్వాత తెలియనుంది. విజయ్‌ దేవరకొండ ప్రస్తుతం టాలీవుడ్‌ లో మోస్ట్‌ సెన్షేషనల్‌ హీరో. ఆయన తమ్ముడు అంటే ఆనంద్‌ దేవరకొండపై కూడా అంచనాలు భారీగా ఉన్నాయి. ఆ అంచనాలను అందుకోవాలంటే దొరసాని హై లెవల్‌ లో ఉండాలి. మరి దొరసాని ఏ రేంజ్‌ లో ప్రేక్షకులను ఆకట్టుకోబోతుందో చూడాలి.
Tags:    

Similar News