టాలీవుడ్ లేటెస్ట్ సెన్సేషన్ విజయ్ దేవరకొండలో స్పెషాలిటి ఓన్లీ యాక్టింగో.. లుక్సో అనుకుంటే మీరు ఈ జెనరేషన్ టేస్ట్ కి కాస్త దూరంగా ఉన్నట్టే. అసలు యూత్ కి విజయ్ దగ్గర కావడానికి కారణం వీటన్నిటినీ మించిన 'రౌడీ యాటిట్యూడ్'. అందుకేగా 'రౌడీ వేర్' అనే సొంత దుస్తుల బ్రాండ్ ను ఈమధ్యే ప్రారంభించాడు.
దాంతో పాటు మన తెలుగు కుర్రోళ్ళ ఫేవరెట్ రౌడీ ఈమధ్య 'వాట్ ద ఎఫ్' అంటూ సాగే ఒక బోల్డ్ పాటను పాడేందుకు మొదటిసారిగా గొంతు సవరించుకున్నాడు. అసలే విజయ్ దేవరకొండ క్రేజ్ పీక్స్ లో ఉంది.. దానికి తోడు బోల్డ్ లిరిక్స్ తో ఉన్న పాట పాడడంతో యూట్యూబ్ లో వ్యూస్ విపరీతంగా వచ్చాయి. గురువారమే ఈ పాట విడుదలైనా.. వీడియో అతి తక్కువ సమయంలోనే ట్రెండింగ్ లోకి వెళ్ళింది కూడా. కానీ ఎప్పుడైతే 'రౌడీ' వేషాలేస్తామో అప్పుడు వ్యతిరేకత కూడా వస్తుంది కదా..! పాటలో సీతాదేవి - సావిత్రిల ప్రస్తావన ఉండడంతో ఓ వర్గం వారికి నచ్చలేదు. దీంతో వాళ్ళు లిరిక్స్ మీద అభ్యంతరాలు వ్యక్తం చేశారట. దీంతో అది పెద్ద కాంట్రవర్సీ అయింది. రిలీజ్ కు చాలా తక్కువ సమయం ఉందనగా విషయం అనసరంగా పెద్దది చేయడం ఎందుకనుకున్నారో ఏమో.. వాట్ ద ఎఫ్ పాటను నిన్న రాత్రి యూట్యూబ్ నుండి తొలగిచారు మేకర్స్.
ఇప్పుడు పాట కోసం సెర్చ్ చేస్తే 'ఈ వీడియో అందుబాటులో లేదు' అని మెసేజ్ కనిపిస్తోంది. ఏదేమైనా దేవరకొండ ఫస్ట్ సాంగ్ ఇలా కావడం అభిమానులకు కాస్త నిరాశ కలిగించే విషయమే. మరి లిరిక్స్ ను మార్చి కొత్త వెర్షన్ రిలీజ్ చేస్తారా లేదా వేచి చూడాలి.