యూత్ లో విపరీతమైన క్రేజ్ ఉన్న విజయ్ దేవరకొండ మరోసారి తన సత్తా చాటాడు. పెద్దగా అంచనాలు లేకుండా వచ్చిన ‘ట్యాక్సీవాలా’ చిత్రం మొదటి రోజే 10 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ను దక్కించుకుంది. తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్ లో కూడా ఈ చిత్రం మంచి వసూళ్లు దక్కించుకుంది. అర్జున్ రెడ్డి - గీత గోవిందం చిత్రాల తర్వాత చేసిన నోటా తో నిరాశ పర్చినా కూడా ‘ట్యాక్సీవాలా’గా మంచి రైడ్ కు విజయ్ తీసుకు వెళ్లాడు అంటూ ఫ్యాన్స్ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ సమయంలోనే ఫ్యాన్స్ విజయ్ దేవరకొండ నిర్ణయంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
ట్యాక్సీవాలా సినిమా ప్రమోషన్స్ లో భాగంగా మీడియాతో మాట్లాడిన సమయంలో విజయ్ దేవరకొండ ఇకపై సంవత్సరంకు ఒక్క చిత్రం తోనే వస్తాను అంటూ ప్రకటించాడు. స్టార్ హీరోలు అయిన మహేష్ బాబు - చరణ్ - ఎన్టీఆర్ లు సంవత్సరంకు రెండు సినిమాలు చేయాలని గట్టి ప్రయత్నాలు చేస్తుంటే విజయ్ దేవరకొండ ఒక్క సినిమా చాలు అనడంతో అభిమానులు కాస్త అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
‘నోటా’ చిత్రం సమయంలో మూడు సినిమాలు చేస్తున్న కారణంగా ఆ సినిమాపై ఎక్కువ శ్రద్ద పెట్టలేక పోయాను. అందుకే నోటా ఫ్లాప్ అయ్యిందని చెప్పిన విజయ్ దేవరకొండ, ఆ కారణం వల్లే ఇకపై ఒకే సారి ఒక్క సినిమాను మాత్రమే చేయాలని ఫిక్స్ అయినట్లుగా చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం చేస్తున్న డియర్ కామ్రేడ్ ను మెల్లగా పూర్తి చేసి జూన్ లేదా జులై లో ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నట్లుగా చెప్పుకొచ్చాడు. ఆ తర్వాత కొత్త సినిమాను పట్టాలెక్కిస్తాను అన్నాడు.
సంవత్సరంకు రెండు సినిమాలైన తీసుకు రావాలని, మరీ ఒక్క సినిమా నిర్ణయం ఏంటీ విజయ్ అంటూ అభిమానులు సోషల్ మీడియాలో ప్రశ్నిస్తున్నారు. అయితే అనుకున్నయని సినిమా ఇండస్ట్రీలో జరుగవు. మరి దేవరకొండ అనుకున్నట్లుగా జరుగదని, ఆయన సంవత్సరంలో ఒకటికి మించే సినిమాలు చేసే అవకాశం ఉందని కొందరు అంచనా వేస్తున్నారు. విజయ్ దేవరకొండ వంటి క్రేజీ హీరో సంవత్సరంకు ఒక్క సినిమా చేస్తానంటూ ప్రకటించడం నిర్మాతలకు కూడా కాస్త నిరాశను కలిగిస్తోంది.