రియ‌ల్ గోవిందుడికి అన్ని డ్రెస్ క‌ష్టాల‌ట‌!

Update: 2018-08-20 03:30 GMT
అతిశ‌యోక్తి అనుకోకుంటే.. అప్పుడెప్పుడో ప‌వ‌న్ క‌ల్యాణ్ గా చెప్పాలి. టాలీవుడ్‌లో అప్ప‌టివ‌ర‌కూ సాగుతున్న మొనాటినీని బ‌ద్ధ‌లు కొట్టొట్టం ఒక ఎత్తు అయితే.. అప్ప‌ట్లో హీరోలంటే ఆకాశంలో నుంచి ఊడిప‌డిన‌ట్లుగా వ్య‌వ‌హ‌రించే తీరుకు భిన్నంగా.. బిడియంగా.. విప‌రీత‌మైన మొహ‌మాటం.. ద‌య‌.. త‌న ద‌గ్గ‌ర ఉన్నదంతా ఇచ్చేయ‌టానికి వెనుకాడ‌ని త‌త్త్వం ఇలాంటివెన్నో ప‌వ‌న్ క‌ల్యాణ్ కు స‌రికొత్త ఇమేజ్ ను తెచ్చి పెట్టాయి.

క‌ట్ చేస్తే.. మ‌ళ్లీ ఇప్పుడు అలాంటి ఇమేజ్ ను విజ‌య్ దేవ‌ర‌కొండ సొంతం చేసుకున్న‌ట్లుగా ఇప్పుడు మాట‌లు వినిపిస్తూ ఉన్నాయి. అప్పుడు ప‌వ‌న్ ఎలా సంచ‌ల‌న‌మో ఇప్పుడు విజ‌య్ దేవ‌ర‌కొండ అంతే సంచ‌ల‌నంగా అభివ‌ర్ణిస్తున్న వారు లేక‌పోలేదు. ఇప్ప‌టి త‌రానికి అస‌లుసిస‌లు ప్ర‌తినిధిగా.. మంచిగా ఉంటూనే.. కాస్త తేడా వ‌చ్చినా చిరాకుప‌డిపోయే త‌త్త్వంతోపాటు.. చుట్టూ ఉన్న వారి క‌ష్టాల‌కు చ‌లించిపోవ‌టం అత‌గాడి మీద మ‌రింత క్రేజ్ పెరిగేలా చేస్తోంది.

వ‌రుస విజ‌యాల త‌ర్వాత కూడా.. త‌న గ‌తం గురించి చెప్పాల్సి వ‌స్తే.. నిజాయితీగా.. ఉన్న‌ది ఉన్న‌ట్లుగా.. జ‌రిగినది జ‌రిగిన‌ట్లుగా చెప్పే తీరు అంద‌రికి ఆక‌ట్టుకుంటోంది. తాజాగా ఇచ్చిన ఓ ఇంట‌ర్వ్యూలో త‌న దుస్తుల గురించి విజ‌య్ దేవ‌ర‌కొండ చెప్పిన మాట‌లు విన్న‌ప్పుడు అత‌గాడి తీరు అంద‌రిని ఇంప్రెస్ చేసేయ‌ట‌మే కాదు.. ఎంత కాలానికి  మ‌న‌లాంటోడు ఒక‌డు స్టార్ అయ్యాడ‌న్న భావ‌న క‌ల‌గ‌టం ఖాయం.  మ‌ధ్య త‌ర‌గ‌తి.. దిగువ‌.. ఎగువ మ‌ధ్య త‌ర‌గ‌తికి చెందిన  ప్ర‌తి ఒక్క‌రూ త‌మ‌ను తాము చూసుకునేలా అనిపించే విజ‌య్ దేవ‌ర‌కొండ మాట‌ల్ని అత‌ని మాట‌ల్లోనే చూస్తే..  

డ్రస్సింగ్‌ ని చాలా నార్మల్‌ గా తీసుకుంటారు గానీ... దానికీ ప్రత్యేక స్థానం ఇవ్వాలి. ఏడో తరగతిలో ఉన్నప్పుడు ‘లావా’ అనే కంపెనీ పెట్టాలని.. అందులో కొత్త తరహా డ్రస్సింగ్‌ ని పరిచయం చేయాలని అనుకునేవాడ్ని. నా వరకూ ఏడాదికి సరిపడా దుస్తుల్ని ఒకేసారి కొనేసేవాడ్ని. డిస్కౌంట్‌ సేల్‌ ఎప్పుడుందో చూసుకుని, చీప్‌ గా ఎక్కడ దొరుకుతాయో ఆరా తీసి.. కొనేవాడ్ని.

అమ్మ నాకు కొంత బడ్జెట్‌ ఇచ్చేది. అందులోనే వీలైనన్ని ఎక్కువ జతలు కొనేవాడ్ని. ‘ఎవడే సుబ్రమణ్యం’ ప్రమోషన్లకు ఇంటర్వ్యూలు ఇవ్వాల్సి వచ్చింది. అప్పుడు నా దగ్గర సరైన దుస్తులు లేవు. ‘ఈ సినిమాలో వాడిన కాస్ట్యూమ్స్‌ నేను తీసుకెళ్లిపోవచ్చా’ అని నిర్మాతల్ని అడిగి తీసుకొచ్చా. వాటిలో నాని కోసం కొన్న రెండు మూడు జాకెట్స్‌ ఉన్నాయి.

‘పెళ్లి చూపులు’ సమయంలోనూ వాటిని వాడేశా. ప్రమోషన్లకు వెళ్తున్నప్పుడు దుస్తుల కోసం వెదుక్కున్నవాడ్ని.. ఇప్పుడు ‘రౌడీ’ పేరుతో ఓ బ్రాండ్‌ పెట్టాను. నా దృష్టిలో ఎదగడం అంటే ఇదే. ఇదే నా జర్నీ.


Tags:    

Similar News