`బీస్ట్ మోడ్ ఆన్`.. `ఐ` చియాన్ ని త‌ల‌పిస్తాడా?

Update: 2020-12-28 03:45 GMT
ఎంపిక చేసుకున్న పాత్ర‌లో ప‌ర‌కాయ ప్ర‌వేశం చేయాలంటే అందుకు చాలానే శ్ర‌మించాల్సి ఉంటుంది. కేవ‌లం న‌టిస్తే స‌రిపోదు. అవ‌స‌రం మేర రూపురేఖ‌ల్ని మార్చుకోవాల్సి ఉంటుంది. ఈ విష‌యంలో మ‌న స్టార్ల క‌మిట్ మెంట్ ని ప్ర‌శంసించి తీరాలి.

అవ‌స‌రం అనుకుంటే జిమ్ముల్లో కండ‌లు పెంచి భీక‌రాకారంతో క‌నిపిస్తున్నారు. వ‌ద్దు అనుకుంటే తిరిగి స్లిమ్ లుక్ లోకి వ‌చ్చేస్తున్నారు. ఇందుకోసం సుశిక్షితులైన జిమ్ కోచ్ లు.. ఫిజిక‌ల్ ఫిట్నెస్ ట్రైన‌ర్లు.. ఆహార నిపుణుల సాయం తీసుకుంటున్నారు. డార్లింగ్ ప్ర‌భాస్ .. రామ్ చ‌ర‌ణ్.. బ‌న్ని.. ఎన్టీఆర్ లాంటి స్టార్ హీరోలు త‌మ రూపాన్ని నిరంత‌రం మార్చుకునే తీరు అసాధార‌ణం. ఇటీవ‌ల ఈ లీగ్ లో యువ‌హీరోలు రామ్ .. నాగ‌శౌర్య‌.. విజ‌య్ దేవ‌ర‌కొండ చేరారు.

తాజాగా విజయ్ దేవరకొండ `బీస్ట్ మోడ్ ఆన్` అంటూ కండరాలు షేప‌ప్ కోసం జిమ్ లో శ్ర‌మిస్తున్న ఫోటోల్ని షేర్ చేశాడు. వ్యక్తిగత శిక్షకుడి స‌మ‌క్షంలో కండరాల కోసం శిక్షణ పొందుతున్నాడు. ఫిట్‌ లుకింగ్ బాడీ కోసం నిరంత‌రం జిమ్ముల్లో శ్ర‌మిస్తున్నాడు. ఇదంతా దేనికోసమో చెప్పాల్సిన ప‌నే లేదు. పూరి జ‌గ‌న్నాథ్ పిలుపు మేర‌కు ఫైట‌ర్ లో భారీ యాక్ష‌న్ సీక్వెన్సుల కోసం ఇలా రూపం మార్చేస్తున్నాడ‌ట‌. ఇందులో ఫైట‌ర్ గా మిక్స్ డ్ మార్ష‌ల్ ఆర్ట్స్ స‌హా బాక్సింగ్ లాంటివి చేయాల్సి ఉంటుంది. అందుకే ఇలా విజ‌య్ స‌రికొత్త రూపంతో ట్రీటివ్వ‌బోతున్నాడు. ‘బీస్ట్ మోడ్ ఆన్’ చేశాడు కాబ‌ట్టి పెద్ద తెర‌పై అత‌డి రూపం ఎలా ఉండ‌నుంది? అన్న‌ది చూడాలి. ఇప్ప‌టివ‌ర‌కూ స‌హ‌జ‌సిద్ధ‌త రియాలిటీకి ద‌గ్గ‌ర‌గా ఉండే పాత్ర‌ల్లో విజ‌య్ న‌టించాడు. ఈసారి కొత్త రూపంతో అల‌రించ‌డానికి సిద్ధ‌మవుతుండ‌డం అభిమానుల‌ను ఎగ్జ‌యిట్ చేసే విష‌య‌మే. అన్న‌ట్టు బీస్ట్ మోడ్ లో `ఐ` చియాన్ ని గుర్తు చేస్తాడా? అంటూ కామెంట్లు వినిపిస్తున్నాయి.

వీడియో కోసం క్లిక్ చేయండి
Tags:    

Similar News