ఆ సూపర్ స్టార్ రాజకీయాల్లోకి వచ్చేస్తున్నట్లేనా?

Update: 2016-02-20 07:30 GMT
తమిళ రాజకీయాలు ఎప్పుడూ సినిమా వాళ్లతోనే ముడిపడి ఉంటాయి. కరుణానిధి - ఎంజీఆర్ రాజకీయాల్లోకి అడుగుపెట్టినప్పటి నుంచి అక్కడ సినీ రాజకీయమే కొనసాగుతోంది. ప్రస్తుతం ముఖ్యమంత్రిగా ఉన్న జయలలితకు కూడా సినీ నేపథ్యం ఉన్న సంగతి తెలిసిందే. ఆమె తర్వాత రజినీకాంత్ రాజకీయ అరంగేట్రం గురించి చాలా ఏళ్లుగా చర్చ సాగుతోంది కానీ.. ఆయన ఏ సంగతీ తేల్చట్లేదు.

తమిళనాట రజినీకాంత్ తర్వాత అత్యధిక ఫాలోయింగ్ ఉన్న ఇళయదళపతి విజయ్ చూపు ఇప్పుడు రాజకీయాల వైపు తిరుగుతున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. తన తలైవా - కత్తి లాంటి సినిమాల విడుదలకు ముందు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటి నుంచి తాను కూడా రాజకీయ అరంగేట్రం చేయాలని ఆలోచిస్తున్న విజయ్.. ఈ దిశగా ఇప్పుడు కార్యాచరణ మొదలుపెట్టినట్లు తెలుస్తోంది.

తన కొత్త సినిమా ‘తెరి’లో విజయ్ రాజకీయాల ప్రస్తావన తేబోతున్నట్లు సమాచారం. అంతే కాదు.. ఈ సినిమాకు కొనసాగింపుగా తెరి-2 చేయాలని నిర్ణయించుకున్న విజయ్.. ఆ చిత్రాన్ని పూర్తిగా రాజకీయ నేపథ్యంతోనే తీయాలని ఫిక్సయ్యాడట. విజయ్ సూచనల మేరకు డైరెక్టర్ అత్లీ ఆల్రెడీ స్క్రిప్టు కూడా రెడీ చేస్తున్నాడట. విజయ్ రాజకీయ అరంగేట్రానికి ఆ సినిమా ఓ  స్టెప్పింగ్ స్టోన్ లాగా ఉపయోగపడుతుందని అంచనా వేస్తున్నారు. ‘తెరి’ ఏప్రిల్ నెలలో ప్రేక్షకుల ముందుకు రానుండగా.. ఆ తర్వాత భరతన్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తాడు విజయ్. అది అతడికి 60వ సినిమా కావడం విశేషం.
Tags:    

Similar News