యంగ్ టైగర్ కోసం మక్కల్ సెల్వన్..??

Update: 2021-06-15 03:30 GMT
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రధానపాత్రలో తెరకెక్కుతున్న సాలిడ్ యాక్షన్ పాన్ ఇండియా మూవీ సలార్. కేజీఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. ఫస్ట్ పాన్ ఇండియా డెబ్యూ కేజీఎఫ్ సినిమాతోనే తనకంటూ ప్రత్యేక ఫ్యాన్ బేస్ క్రియేట్ చేసుకున్నాడు దర్శకుడు ప్రశాంత్ నీల్. ఒక్క సినిమాతో సంచలనం సృష్టించిన దర్శకుడితో ప్రభాస్ సినిమా కన్ఫర్మ్ అయ్యేసరికి డార్లింగ్ అభిమానులలో అంచనాలు డబుల్ అయిపోయాయి. వీరి కాంబినేషన్ ఎలా సెట్ అయిందో గాని ప్రభాస్ - ప్రశాంత్ నీల్ కాంబోలో సినిమా సలార్ గురించి ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్స్.

అయితే షూటింగ్ దశలో ఉన్నటువంటి సలార్ మూవీ వచ్చే ఏడాది రిలీజ్ ప్లాన్ లో ఉండగా ఇప్పటివరకు రెండు షెడ్యూల్స్ పూర్తి చేసుకుంది. ఈ సినిమాతో ప్రభాస్ లో నుండి మరో మాస్ యాంగిల్ బయటికి రానుందని ఇదివరకే డైరెక్టర్ చెప్పాడు. ప్రస్తుతం వరుసగా పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ సెట్ చేసుకోవడంతో ప్రశాంత్ నీల్ బిజీ అయిపోయాడు. ఇటీవలే టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో మరో పాన్ ఇండియా మూవీ ఓకే చేసి పెట్టుకున్నాడు. వీలైనంత త్వరగా సలార్ పూర్తిచేసి ఎన్టీఆర్ ప్రాజెక్ట్ పట్టాలెక్కించే ఆలోచనలో ఉన్నాడని తెలుస్తుంది. అయితే తాజాగా ఎన్టీఆర్ సినిమా గురించి ఓ వార్త సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది.

ఎన్టీఆర్ తో తీయబోయే పాన్ ఇండియా మూవీ కోసం మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతిని సంప్రదించినట్లు ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. మరి ఎన్టీఆర్ సినిమాలో సేతుపతి ఏ పాత్రలో కనిపిస్తాడో తెలియదు కానీ వార్త వినే సరికి నందమూరి అభిమానులు మాత్రం ఎగిరి గంతేస్తున్నారు. ఎందుకంటే విజయ్ సేతుపతికి తెలుగు రాష్ట్రాలలో మంచి ఫ్యాన్ బేస్ ఉంది. ఆయన నటించే ప్రతి సినిమా కూడా తెలుగులోకి అనువాదం అవుతున్నాయి. ప్రశాంత్ నీల్ - ఎన్టీఆర్ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో నిర్మించనున్నారు. మరి ఎన్టీఆర్ ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో ఆర్ఆర్ఆర్ సినిమా చేస్తున్నాడు. ఆ సినిమా కంప్లీట్ అయితే కొరటాల శివతో మరో సినిమా చేసి ప్రశాంత్ సినిమా చేయనున్నాడు.
Tags:    

Similar News