తమిళ డైరెక్టర్ కే.ఎస్. రవికుమార్ గురించి మన తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. తాను డైరెక్ట్ చేసే ప్రతి సినిమాని తెలుగులో కూడా డబ్బింగ్ చేసి రిలీజ్ చేయడంతో ఇక్కడ కూడా మంచి గుర్తింపుని తెచ్చుకున్నాడు. 'ముత్తు' 'భామనే సత్య భామనే' 'నరసింహా' 'తెనాలి' 'పంచతంత్రం' 'దశావతారం' వంటి డబ్బింగ్ సినిమాలతో తెలుగులో కూడా మార్కెట్ క్రియేట్ చేసుకున్నాడు. కోలీవుడ్ స్టార్ హీరోలందరితో సినిమాలు తీసిన కే ఎస్ రవికుమార్ టాలీవుడ్ లో స్టార్ హీరోలతో కూడా సినిమాలు తెరకెక్కించాడు. మెగాస్టార్ చిరంజీవితో 'స్నేహం కోసం'.. కింగ్ నాగార్జునతో 'బావ నచ్చాడు'.. నందమూరి బాలకృష్ణ తో 'జై సింహా' 'రూలర్' వంటి చిత్రాలకు దర్శకత్వం వహించాడు. ఈ సినిమాలన్నీ పరాజయాలుగా మిగిలిపోయాయి. కాగా కే.ఎస్ దర్శకుడిగానే కాకుండా రచయితగా నిర్మాతగా నటుడిగా మల్టీ టాలెంటెడ్ అని నిరూపించుకున్నాడు. ఇప్పుడు సినిమాలకు దర్శకత్వం వహిస్తూనే తమిళ నాట విలన్ గా క్యారెక్టర్ ఆరిస్టుగా నటిస్తూ వరుస ఆఫర్స్ తో దూసుకుపోతున్నాడు. ఇటీవల తమిళ హీరో అజిత్ తో కలిసి ఓ చిత్రం చేయబోతున్నట్లు ట్విట్టర్ ద్వారా కె.ఎస్.రవికుమార్ వెల్లడించిన సంగతి తెలిసిందే. 2002లో అజిత్ తో కలిసి ‘విలన్’ అనే చిత్రాన్ని చేశారు రవికుమార్. అంటే 17 ఏళ్ళ తర్వాత మళ్ళీ వీరిద్దరి కాంబినేషన్ లో మరో సినిమా రాబోతోందన్నమాట. సన్ పిక్చర్స్ పతాకంపై నిర్మితమయ్యే ఈ చిత్రానికి జీవీ ప్రకాష్ సంగీతం అందించనున్నారు. ఆగస్ట్ లో ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ కానుందని సమాచారం.
ఇదిలా ఉండగా సూపర్ గుడ్ ఫిలిమ్స్ బ్యానర్ లో కే.ఎస్. రవికుమార్ మూవీ చేయడానికి సిద్ధం అయ్యారని గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. సూపర్ గుడ్ ఫిలిమ్స్ అంటే 'సుస్వాగతం' 'సూర్యవంశం' 'రాజా' 'శీను' 'నువ్వు వస్తావని' 'నిన్నే ప్రేమిస్తా' 'ప్రియమైన నీకు' 'సింహరాశి' 'శివరామరాజు' 'అందాల రాముడు' 'రచ్చ' వంటి సినిమాలు గుర్తుకు వస్తాయి. తెలుగు తమిళం మరియు మలయాళంలో అనేక చిత్రాలు నిర్మించిన ఆర్ బి చౌదరి ప్రొడక్షన్ హౌస్ లో మూవీ అంటే సూపర్ హిట్ అన్నట్లుగా ముద్ర పడిపోయింది. గతేడాది 'సైరా నరసింహా రెడ్డి' సినిమాని తమిళ్ లో డబ్బింగ్ చేసిన ఆర్ బి చౌదరి ఇప్పుడు కే.ఎస్. రవికుమార్ తో సినిమా తీయబోతున్నాడట. తమిళ నటులు విజయ్ సేతుపతి మరియు సత్యరాజ్ లు ఈ సినిమాలో నటించే అవకాశాలు ఉన్నాయట. అంతేకాకుండా ప్రాఫిట్ షేరింగ్ విధానంలో సత్యరాజ్ మరియు విజయ్ సేతుపతి ఈ మూవీ నిర్మాణంలో భాగస్వాములు అయ్యారని..ఇప్పటికే వీరి మధ్య ఒప్పందం కుదిరిందని కోలీవుడ్ మీడియా కోడైకూస్తోంది. అన్నీ అనుకున్నట్లు జరిగితే ఈ సినిమా అజిత్ తో సినిమా పూర్తైన తర్వాత ఈ సినిమా పట్టాలెక్కే అవకాశం ఉందని సమాచారం. ఏదేమైనా తెలుగులో ప్లాప్ డైరెక్టర్ గా ముద్ర పడిన కే.ఎస్. రవికుమార్ కి తమిళ్ మాత్రం క్రేజ్ తగ్గడం లేదని చెప్పవచ్చు.