'సేనాప‌తి 2' దే హ‌వా అంట‌గా

Update: 2018-12-22 14:50 GMT
క్రిస్మ‌స్ కానుక‌గా అన్ని ప‌రిశ్ర‌మ‌ల్లో గంప‌గుత్త‌గా సినిమాలు రిలీజ‌య్యాయి. ఏకంగా 9 రోజుల పాటు సెల‌వు దినాలు కావ‌డంతో క్యాష్ చేసుకునేందుకు నిర్మాత‌లు భారీగా రిలీజ్ లు ప్లాన్ చేయ‌డంతో థియేట‌ర్ల‌లో సంద‌డి వాతావ‌ర‌ణం నెల‌కొంది. తెలుగులో రెండు స్ట్రెయిట్ సినిమాలు, మ‌రో రెండు డ‌బ్బింగులు రిలీజ‌వ్వ‌గా, త‌మిళ‌నాడులో ఏకంగా 9 సినిమాలు రిలీజ‌య్యాయి. హిందీలో `జీరో` లాంటి భారీ ప్ర‌యోగాత్మ‌క‌ చిత్రం రిలీజైంది.

అయితే ఏ సినిమా రిపోర్టు ఎలా ఉంది? అన్న‌ది ప‌రిశీలిస్తే .. తెలుగు సినిమాల్లో ఇది ష్యూర్ షాట్ బ్లాక్ బ‌స్ట‌ర్ అన్న టాక్ ఒక్క‌దానికీ రాలేదు. డ‌బ్బింగు సినిమాలు సోసోనే అన్న మాటా వినిపించింది. ఇక‌పోతే అటు షారూక్ `జీరో`కి మిశ్ర‌మ స్పంద‌న‌లు రావ‌డంతో నిరాశ త‌ప్ప‌లేదు. మ‌రోవైపు త‌మిళ‌నాడులో మాత్రం 9 సినిమాలు రిలీజైతే, అందులో విజ‌య్ సేతుప‌తి న‌టించిన `సీత‌క‌త్తి` ఒక్క‌టే బ్లాక్ బ‌స్ట‌ర్ అన్న టాక్ తెచ్చుకుంది. సినిమాలో ల్యాగ్ ఉన్నా త‌న‌దైన న‌ట‌న‌తో క‌థ న‌డిపించే స‌త్తా ఉన్న విజ‌య్ సేతుప‌తి సినిమా ఆద్యంతం భుజ‌స్కంధాల‌పై వేసుకుని నడిపించ‌డంతో ఆ సినిమాకి బెస్ట్ హిట్ అన్న‌ టాక్ వ‌చ్చింది.

ముఖ్యంగా భార‌తీయుడు `సేనాప‌తి` త‌ర‌హా గెట‌ప్‌ తో విజ‌య్ ఆక‌ర్షించ‌డం `సీత క‌త్తి` సినిమాకి ప్ల‌స్ అయ్యింది. అండ‌ర్ ప్రొడ‌క్ష‌న్ ద‌శ‌లోనే ఈ చిత్రం చ‌ర్చ‌ల్లోకొచ్చింది. సేనాప‌తి -2 వ‌స్తున్నాడా? అంటూ ప్ర‌చారం చేయ‌డంతో అది సినిమాకి క‌లిసొచ్చింది. సేత‌పతి హీరోగా `నడువుల కొంజెం పక్కత్త కానోమ్` అనే సూపర్ హిట్ సినిమా తీసిన బాలాజీ ఈ చిత్రాన్ని రూపొందించ‌డంతో ట్రేడ్‌ లోనూ క‌లిసొచ్చింది. అలాగే  తెలుగ‌మ్మాయి ఐశ్వ‌ర్య రాజేష్ న‌టించిన `క‌నా` చిత్రం బావుంద‌ని టాక్ వినిపించినా, లేడీ ఓరియెంటేష‌న్ వ‌ల్ల ఓపెనింగులు రాలేదు. ధ‌నుష్ మారి-2 యావ‌రేజ్ గా నిలిచింది. ధ‌నుష్ మాస్ అవ‌తారం బావున్నా కంటెంట్‌లో రొటీన్ గా ఉండ‌డంతో జ‌నాలు యావ‌రేజ్ అని తేల్చేశారు. ఇక తెలుగులో ఈ సినిమా రిలీజైందో  లేదో కూడా ఎవ‌రికీ తెలీదు.


Tags:    

Similar News