వారం వ్యవధిలో విడుదలై సంచలనం రేపిన బాహుబలి - భజరంగి భాయిజాన్ సినిమాలతో దేశవ్యాప్తంగా విజయేంద్ర ప్రసాద్ పేరు మార్మోగిపోయింది. బాహుబలి-2కు సంబంధించిన పెన్ వర్క్ అంతా కూడా పూర్తి చేసిన విజయేంద్ర ప్రసాద్ తర్వాత ఏ సినిమా చేయబోతున్నాడన్న విషయంలో అందరిలోనూ ఆసక్తి నెలకొంది. ఆయన మరో రెండు ఇంట్రెస్టింగ్ ప్రాజెక్టులకు కథ అందిస్తుండటం విశేషం. ఆ రెండూ కూడా తెలుగు సినిమాలు కావు. ఒకటి కన్నడ మూవీ. ఇంకోటి హిందీ సినిమా.
కన్నడలో విజయేంద్రుడు కథ అందిస్తున్న సినిమా ప్రెస్టీజియస్ ప్రాజెక్టు. మాజీ ప్రధాని దేవెగౌడ మనవడు - మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి తనయుడు అయిన నిఖిల్ ను హీరోగా పరిచయం చేస్తూ తీస్తున్న ‘జాగ్వర్’ సినిమాకు విజయేంద్ర ప్రసాద్ స్టోరీ ఇచ్చారు. ఈ సినిమాను భారీ బడ్జెట్ తో రూపొందిస్తున్నారు. ఇక రాజమౌళి ఫాదర్ చేస్తున్న హిందీ సినిమా ఓ డిఫరెంట్ కాన్సెప్ట్ తో తెరకెక్కుతోంది.
తొలిసారి విజయేంద్ర ప్రసాద్ ఓ అడల్ట్ కామెడీ కథ ట్రై చేస్తున్నారు. హాలీవుడ్ తరహాలో ఈ అడల్ట్ కామెడీ ఉంటుందని సమాచారం. ఢిల్లీ బెల్లీ తరహాలో చాలా ఫన్నీగా ఉండే కాన్సెప్ట్ ఇదని అంటున్నారు. ఓ ప్రముఖ నిర్మాణ సంస్థ అందరూ కొత్త వాళ్లతో ఈ సినిమాను రూపొందించబోతోంది. అర్బన్ ఆడియన్స్ ఈ కథతో బాగా కనెక్టవుతారట. అందుకే ముందు తెలుగులో అనుకున్న ఈ కథను బాలీవుడ్ కు పట్టుకెళ్లారు. ‘భజరంగి భాయిజాన్’ తర్వాత తన కథను ఒప్పించడానికి విజయేంద్ర ప్రసాద్ పెద్దగా కష్టపడాల్సిన పని లేకపోయింది.