కాస్టింగ్ మంటల్లో క్వీన్ దర్శకుడు

Update: 2018-10-07 08:16 GMT
టాలీవుడ్ లో కాస్త చల్లరాయి కాని బాలీవుడ్ లో మాత్రం కాస్టింగ్ కౌచ్ తో పాటు లైంగిక వేధింపుల వివాదాలు రోజు రోజుకి కొత్త మలుపులు తిరుగుతున్నాయి. తనుశ్రీదత్త రేపిన మంటలు ఇంకా చల్లరనే లేదు. నానా పటేకర్ తో మొదలుపెట్టిన తనుశ్రీ ఈ లిస్టు ని కొనసాగిస్తాను అని చెబుతోంది. ఇప్పుడు ఈ వరసలో కంగనా రౌనత్ కూడా చేరింది. నాలుగేళ్ల క్రితం వచ్చిన క్వీన్ షూటింగ్ సమయంలో దర్శకుడు వికాస్ బహ్ల్ ప్రవర్తన గురించి ఇప్పుడు బయటికి చెబుతోంది.

గతంలో క్వీన్ టీమ్ లో పని చేసిన ఓ సభ్యురాలిని లేట్ నైట్ కావడంతో వికాస్ ఆమెను  ఇంటి దగ్గర డ్రాప్ చేయడానికి బయలుదేరాడు. ఆ సందర్భంగా ఇద్దరు మద్యం మత్తులో ఉన్నామనే అవకాశాన్ని వాడుకుని తనను వేధించే ప్రయత్నం చేసాడనే  ఆరోపణలతో సదరు ఆర్టిస్టు తీవ్రంగా ఫైర్ అయ్యింది. ఈ వివాదం గురించి మాట్లాడుతూ కంగనా తాను ఆ అమ్మాయి వైపే ఉంటానని ఎందుకుంట స్త్రీలోలుడైన వికాస్ బహ్ల్ అలా ప్రవర్తించి ఉంటాడనటంలో ఆశ్చర్యం లేదని చెప్పి షాక్ ఇచ్చింది. అంతే కాదు పెళ్లయ్యాక కూడా రోజుకో అమ్మాయితో గడపాలి అని కోరుకునే అతని మనస్తత్వం గురించి గట్టిగానే చురకలు వేసింది.

వ్యసనం బలహీనతగా మారినప్పుడు మనిషి ఎలా తయారవుతాడో వికాస్ మంచి ఉదాహరణ అని చెప్పిన కంగనా ఆ అమ్మాయి అభియోగాలకు పూర్తి మద్దతు తెలిపింది. విచిత్రం ఏంటంటే మహిళా సాధికారతనే సబ్జెక్టుగా తీసుకుని హీరో లేకుండా హీరోయిన్ ఓరియంటెడ్ కాన్సెప్ట్ తో మెప్పించిన వికాస్ వ్యక్తిగత జీవితంలో మాత్రం స్త్రీలోలుడు కావడం. ఇదే క్వీన్ ఇప్పుడు నాలుగు భాషల్లో వేర్వేరు దర్శకులు హీరోయిన్ల తో రీమేక్ షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకు రెడీ అవుతోంది. వికాస్ బహ్ల్ ఇంకా స్పందించాల్సి ఉంది.

ఇలాంటి వేధింపుల పర్వం పరిశ్రమలో ముందు నుంచే ఉన్నప్పటికీ ఇప్పుడు మాత్రం విస్తృత చర్చకు దారి తీస్తోంది. కంగనా మణికర్ణిక ప్రమోషన్స్ కోసం చేస్తున్న కార్యక్రమాల్లో భాగంగా ఎదురైన ప్రశ్నకు సమాధానంగా వికాస్ బహ్ల్ గురించి నిజాలు చెప్పడం ఇప్పుడు బాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది.
Tags:    

Similar News