ఆగని లోకనాయకుడి బాక్సాఫీస్ జోరు..!

Update: 2022-06-22 03:30 GMT
యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ ఇన్నాళ్ల దాహం తీరింది. ఒకప్పుడు ఎన్నో అద్బుత సినిమాలను అందించిన కమల్‌ హాసన్‌.. ఎన్నో బ్లాక్ బస్టర్ సక్సెస్ లను దక్కించుకున్న కమల్‌ గత దశాబ్ద కాలంగా సరైన సక్సెస్ లేక ఢీలా పడి పోయాడు. ఇలాంటి సమయంలో లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో రూపొంది విడుదల అయిన విక్రమ్‌ సినిమా బాక్సాఫీస్ ను షేక్‌ చేస్తోంది.

విడుదల అయ్యి మూడు వారాలు పూర్తి కావస్తున్నా కూడా ఇంకా కూడా హడావుడి కనిపిస్తూనే ఉంది. నాలుగు వందల కోట్ల వసూళ్లకు చేరువగా విక్రమ్‌ కలెక్షన్స్‌ ఉన్నాయి. లాంగ్‌ రన్‌ లో ఆ మార్క్ కూడా దాటినా ఆశ్చర్యం లేదు అంటూ బాక్సాఫీస్ వర్గాల వారు అంటున్నారు. తమిళనాడు తో పాటు తెలుగు రాష్ట్రాల్లో మరియు ఉత్తర భారతంలో కూడా విక్రమ్‌ కుమ్మేస్తున్నాడు.

కమల్‌ హాసన్ యొక్క నట విశ్వరూపం ను చూపించడంతో పాటు దర్శకుడు లోకేష్ కనగరాజ్ తనదైన శైలిలో సినిమా ను తెరకెక్కించి ఆకట్టుకున్నాడు. చాలా కాలం తర్వాత తమిళ సినిమాకు రిపీట్‌ ఆడియన్స్ వస్తున్న సినిమా ఇదే అంటూ అక్కడి మీడియా కోడై కూస్తోంది. తమిళంలో రూపొంది. 2.ఓ సినిమా తర్వాత స్థానంలో వసూళ్ల విషయంలో విక్రమ్‌ నిలిచింది.

తమిళనాట ఆల్ టైమ్ రికార్డు ను నమోదు చేసిన విక్రమ్‌ సినిమా ఇతర భాషల్లో కూడా ఏమాత్రం తగ్గకుండా వసూళ్లను దక్కించుకుంటుంది అంటూ సమాచారం అందుతోంది. లోకేష్ కనగరాజ్ ఈ సినిమా చివర్లో సూర్యను తీసుకు రావడం.. ఇక విజయ్ మరియు ఫాహద్‌ ఫాసిల్స్ కు కీలక పాత్రలు ఇవ్వడం వంటి కారణాల వల్ల రిపీట్ ఆడియన్స్ ఉంటున్నారు.

కమల్‌ హాసన్‌ లోక నాయకుడు అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఎంతటి పేరు ఉన్నా కూడా కమర్షియల్‌ గా సక్సెస్ లు లేనప్పుడు ఎందుకు ఆ పేరు అన్నట్లుగా అనిపిస్తుంది. ఇన్నాళ్లు కమల్‌ కూడా అదే భావించి ఉంటారు.

ఇప్పుడు ఆయన ఈ సినిమా దాదాపుగా నాలుగు వందల కోట్ల వసూళ్లు రాబట్టిన నేపథ్యంలో గర్వంగా ఇండస్ట్రీలో తలెత్తుకుని ఉండేలా చేసిందని ఆయన అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
Tags:    

Similar News