హిట్ కొట్టినా హీరోలు దొరకట్లే?

Update: 2022-08-19 02:30 GMT
సినిమా ఇండస్ట్రీలో సాధారణంగా ఒక సక్సెస్ అందుకోగానే దర్శకులు హీరోలు ఆ తర్వాత చాలా బిజీగా మారిపోతూ ఉంటారు. సక్సెస్ అనంతరం ఎక్కువగా గ్యాప్ ఇవ్వకూడదు అని కూడా ఆలోచిస్తారు. అయితే ఇటీవల కాలంలో మాత్రం సక్సెస్ తో సంబంధం లేకుండా కొంతమంది ప్రాజెక్టులను సెట్ చేసుకున్న విధానం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. టాలెంట్ అనేది ఇక్కడ చాలా ముఖ్యం అలాగే సక్సెస్ అనేది కూడా అందులో చాలా కీలకంగా మారుతుంది.

కేవలం సక్సెస్ కొట్టినంత మాత్రాన ఆ తర్వాత సినిమా కూడా ఇష్టానుసారంగా తెరపైకి తీసుకురావడం అంటే అంత ఈజీ కాదు. ఇక ఇటీవల కాలంలో కొంతమంది దర్శకులు మొదటి సినిమాతో సక్సెస్ అందుకున్నప్పటికీ ఆ తర్వాత వెంటనే హీరోలను సెలెక్ట్ చేసుకోలేకపోతున్నారు.

డిజె టిల్లు సినిమా ఈ ఏడాది సంక్రాంతికి వచ్చి బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా సక్సెస్ తరువాత దర్శకుడు విమల్ కృష్ణ వెంటనే  సీక్వెల్ ను కూడా తెరపైకి తీసుకురావాలని బాగానే ప్రణాళికలు రచించాడు.

ఇక DJ టిల్లు కు కూడా ప్రత్యేకంగా హీరో సిద్దు జొన్నలగడ్డ స్క్రిప్ట్ కూడా సిద్ధం చేసుకోవడం విశేషం. అయితే సీక్వెల్ విషయంలో వీరిద్దరి మధ్య ఎలాంటి విభేదాలు వచ్చాయో తెలియదు కానీ దర్శకుడు విమల్ కృష్ణ ప్రాజెక్టు నుంచి కొన్ని రోజుల్లోనే బయటికి వచ్చేసాడు. ఇక ఇటీవల అతను చాలామంది సంప్రదించాడు. అందులో నితిన్ నాగచైతన్య రామ్ పోతినేని కూడా ఉన్నట్లు తెలుస్తోంది.

ఈ ముగ్గురు దర్శకులతో ఇదివరకే విమల్ కృష్ణకు మంచి పరిచయాలు ఉన్నాయి. దీంతో తన దగ్గర ఉన్న విభిన్నమైన కథలను వారికి తెలియజేయడంతో పాజిటివ్ గానే స్పందించినప్పటికీ ఇంకా ప్రాజెక్టు స్టార్ట్ చేసేంత నమ్మకం గా అయితే గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేనట్లుగా తెలుస్తోంది.

ఇక వీలైనంత త్వరగా విమల కృష్ణ ఎవరో ఒక హీరోని సెలెక్ట్ చేసుకుని తన తదుపరి సినిమాను తెరపైకి తీసుకురావాలని అనుకుంటున్నాడు.
Tags:    

Similar News