టాలీవుడ్ హంక్ రానా నటించిన మోస్టా ప్రెస్టీజియస్ మూవీ `విరాటపర్వం`. సాయి పల్లవి హీరోయిన్ గా నటించిన ఈ మూవీని దర్శకుడు వేణు ఊగుడుల తెరకెక్కించారు. సురేస్ ప్రొడక్షన్స్ డి. సురేష్ బాబు సమర్పణలో ఎస్ ఎల్ వీ సినిమాస్ బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి ఈ మూవీని నిర్మించారు. ఇంత వరకు కనీ వినీ ఎరుగని పాత్రల్లో రానా, సాయి పల్లవి నటించారు. అయితే గత కొంత కాలంగా ఈ మూవీ రిలీజ్ పై సందిగ్థత నెలకొంది. సినిమా పూర్తయి ఏడాది కావస్తున్నా ఇంత వరకు ఈ సినిమాకు సంబంధించిన అప్ డేట్ ని మేకర్స్ అందించలేదు.
దీంతో ఈ సినిమాపై రక రకాల ఊహాగానాలు వినిపించడం మొదలైంది. దీంతో రంగంలోకి దిగిన చిత్ర బృందం ఎట్టకేలకే శుక్రవారం రిలీజ్ డేట్ ని ప్రకటించబోతున్నామని ఓ పోస్టర్ ని ఉదయం విడుదల చేసింది. అన్నట్టుగానే సాయంత్రం 5 గంటలకు ఈ మూవీ రిలీజ్ డేట్ ని ప్రకటించిన షాకిచ్చింది. ఈ చిత్రాన్ని జూలై 1న వరల్డ్ వైడ్ గా భారీ స్థాయిలో థియేటర్లలో రిలీజ్ చేస్తున్నట్టుగా చిత్ర బృందం వెల్లడించింది. ఈ సందర్భంగా రానా, సాయి పల్లవిలకు సంబంధించిన ఓ పోస్టర్ కూడా విడుదల చేసి సర్ ప్రైజ్ ఇచ్చింది.
రిలీజ్ డేట్ పోస్టర్ లో కీకారణ్యంలో రానా చెక్స్ షర్ట్ ధరించి చాలా అట్రెసీవ్ గా కనిపిస్తూ ఓ చేత గన్ పేలుస్తూ మరో చేత అలీవ్ గ్రీన్ డ్రెస్ లో బ్లాక్ చున్నీ ధరించి భయం భయంగా పరుగెడుతున్న సాయి పల్లవిని పట్టుకుని ముందుకు సాగుతున్న స్టిల్ ఆకట్టుకుంటోంది. `తెలుగు నేల నడిచిన కొత్త దారుల నెత్తుటి జ్ఞాపకం మనలోంచి మన కోసం సాగిన ఓ చారిత్రక సందర్బం . ప్రేమ యుద్ధమై సాగిన విరాటపర్వం` అంటూ ఈ సినిమా కథని దర్శకుడు సింగిల్ లైన్ లో చెప్పిన తీరు సినిమాని ఏ స్థాయిలో తెరపై ఆవిష్కరించారో తెలియజేస్తోంది.
ఇప్పటికే విడుదల చేసిన ఫస్ట్ గ్లింప్స్, టీజర్ కు అన్ని వర్గాల నుంచి ట్రెమండస్ రెస్పాన్స్ లభించింది. రిలీజ్ ఆలస్యమైనా సినిమాపై టీమ్ గట్టి నమ్మకంతో వున్నారు. త్వరలోనే ప్రమోషన్స్ ని స్టార్ట్ చేయబోతున్నారు. ఉత్తర తెలంగాణ లో జరిగిన యదార్థ సంఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఇందులో కామ్రేడ్ రవన్నగా విప్లవ కవితలు రాసే అరణ్యగా కనిపించబోతున్నారు. అరణ్య కవితల్ని ఆరాధించే వెన్నెలగా సాయి పల్లవి నటించింది. వార్ నేపథ్యంలో సాగే ఓ అందమైన ప్రేమకథగా ఈ సినిమా వుంటుందని తెలుస్తోంది.
డానీ సాంచెజ్ లోపెజ్, దివాకర్ మణి సినిమాటోగ్రాఫీని అందించగా సురేష్ బొబ్బిలి సంగీతం అందించారు. ప్రియమణి, నందితా దాస్, నవీన్ చంద్ర, జరీనా వాహెబ్, ఈశ్వరీ రావు, సాయి చంద్, బెనర్జీ, నాగినీడు, రాహుల్ రామకృష్ణ, దేవిప్రసాద్, ఆనంద్ రవి, అనంద్ చక్రపాణి తదితరులు కీలక పాత్రల్లో నటించారు.