విరుష్క పై విరుచుకుపడుతున్నారుగా..

Update: 2018-06-18 17:34 GMT
ఇటీవల అనుష్క శర్మ అర్హన్ వ్యక్తిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. కారులో వెళుతున్న వ్యక్తి ప్లాస్టిక్ ను రోడ్డు మీద పారేయడంతో ఆగ్రహించిన అనుష్క అతనికి చివాట్లు పెట్టింది. డస్ట్ బిన్ వాడకుండా ఇలా రోడ్డు మీద చెత్త వేయడం ఎంత వరకు కరెక్ట్ అని కోపంతోనే చెప్పేసింది. అయితే ఈ ఘటన మొత్తం వీడియో తీసిన విరాట్ దాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఎవరైనా చెత్త పడేస్తే మీరు కూడా ప్రశ్నించండి అంటూ కామెంట్ పెట్టి అతని వివరాలు తెలియజేశాడు.

దీంతో సదరు వ్యక్తి ఘటనపై స్పందించాడు. నిజంగా తన తప్పుకు క్షమించమని కోరుతున్నట్లు చెబుతూ.. అనుష్క తనపై అతిగా విమర్శలు చేసిందని చెప్పాడు అర్హాన్ సింగ్. అర్హన్ తల్లి కూడా ఇది ఒక పబ్లిసిటి స్టంట్ అని సోషల్ మీడియా ద్వారా స్పందించారు. అయితే ఈ విషయంపై నెటిజన్స్ కూడా విరుష్కకే కౌంటర్ లు ఇవ్వడం మరింత వైరల్ గా మారింది. పలు విధాలుగా విరుష్క జంటను ప్రశ్నించారు. అనుష్క.. ముందు ని భర్త నోటిని అదుపులో పెట్టుకోమను గ్రౌండ్ లో అతను ఎలాంటి దూషణలకు దిగుతాడో అందరికి తెలిసిందే అని ఒకరు.. చెత్త వేసిన వ్యక్తికి మెల్లగా చెబితే సరిపోయేది. విరాట్ కు అక్కడ జరుగుతున్న ఘటన కన్నా వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేయాలన్నా తపనే ఎక్కువగా కనిపించిందని కొందరు కామెంట్స్ చేశారు.

ఇక మరికొందరైతే విరుష్క ల గత మైనెస్ పాయింట్స్ ను కూడా బయటకు లాగుతూ విమర్శలు గుప్పించారు. అలాగే సదరు అర్హాన్ కు విషయాన్ని సున్నితంగా చెప్పడం బాగుండేదని.. కాని దానిని వీడియో తీసి అతని ప్రైవసీకి భంగం కలిగించడం తప్పంటూ నెటిజన్లు విరుష్కను తిట్టిపోశారు. ట్రోల్స్ ఎక్కువగా వస్తుండడం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. మరి ఈ విషయంపై విరుష్క జోడి ఎలా స్పందిస్తుందో చూడాలి.     


Tags:    

Similar News