రాజకీయాల్లోకి స్టార్ హీరో.. పోటీకి రెడీ

Update: 2020-12-14 13:20 GMT
హీరోలు రాజకీయాల్లోకి రావడం చాలా సర్వసాధారణమైన విషయం.. తెలుగు నాట అన్న ఎన్టీఆర్ నుంచి చిరంజీవి.. నేడు పవన్ కళ్యాణ్, రోజా, బాలక్రిష్ణలు రాజకీయ యవనికపై వెలుగుతున్నారు. అయితే తమిళనాట ఈ ఒరవడి కాస్తా ఎక్కువ.

తమిళనాట ఎంజీఆర్ , అమ్మ జయలలిత, కరుణానిధి, కమల్ హాసన్, రజినీకాంత్ ఇలా సినీ తారలే అక్కడ రాజ్యమేలుతున్నారు. ఈ క్రమంలోనే తమిళ యువ హీరో విశాల్ కూడా తొడగొట్టేశాడు. హీరో విశాల్ వచ్చే ఏడాది జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేయడానికి రెడీ అయ్యాడు.

ఇప్పటికే విశాల్ నిర్మాతల సంఘం, నడిగర్ సంఘాల ఎన్నికల్లో పోటీచేసి అధ్యక్షుడిగా గెలిచాడు. గత అసెంబ్లీ ఎన్నికల్లో దివంగత మాజీ ముఖ్యమంత్రి జయలలిత పోటీ చేసిన ఆర్కే నగర్‌ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడానికి నామినేషన్‌ వేసి, చివరి క్షణంలో నామినేషన్‌ను ప్రతిపాదించిన పదిమందిలో కొందరు మద్దతు ఉపసంహరించుకోవడంతో ఆ నామినేషన్‌ను ఎన్నికల అధికారులు తిరస్కరించడంతో పోటీ చేయలేకపోయారు.

ఈ క్రమంలోనే ఈసారి సీరియస్ గా పాలిటిక్స్ పై విశాల్ దృష్టిసారించాడు. ఈ మేరకు చెన్నైలోని ఒక నియోజకవర్గంలో పోటీచేయాలని విశాల్ నిర్ణయించుకున్నట్టు ఆయన సన్నిహితులు చెబుతున్నారు. దీనిపై తన అభిమాన సంఘం నాయకులతో విశాల్ చర్చిస్తున్నట్టు సమాచారం. ఏ నియోజకవర్గంలో పోటీ అన్నది త్వరలోనే తెలియనుంది.
Tags:    

Similar News