పందెం కోడికి ప్రేయసే విలన్

Update: 2018-05-12 13:41 GMT
కోలీవుడ్ వ్యవహారాల్లో బిజీగా మారిపోయాక సినిమాల మీద ఫోకస్ బాగా తగ్గించిన విశాల్ తక్కువ గ్యాప్ లోనే రెండు బ్యాక్ టు బ్యాక్ యాక్షన్ మూవీస్ తో వస్తున్నాడు. అందులో ఒకటి ఇరుంబుతిరై(తెలుగు అభిమన్యుడు)నిన్న తమిళ్ లో విడుదల కాగా తెలుగు వెర్షన్ మే 17 అన్నారు కాని పక్కాగా ఖరారు చేయాల్సి ఉంది. ఇది కాకుండా మరొకటి కూడా లైన్ లో సిద్ధంగా ఉంది. అదే పందెం కోడి సీక్వెల్. 2005లో వచ్చిన ఈ మూవీ తమిళ్ తో పాటు తెలుగులో కూడా ఘన విజయం సాధించింది. దాని తర్వాతే విశాల్ కు ఇక్కడ మార్కెట్ పెరిగింది. పూర్తి ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో రూపొందిన ఆ మూవీకి ఇక్కడ కూడా ఘనంగా వసూళ్లు దక్కాయి. లింగుస్వామి దర్శకత్వం వహించిన ఆ మూవీ ఇప్పటికీ విశాల్ టాప్ లిస్టులో ఫస్ట్ ప్లేస్ లో కొనసాగుతూనే ఉంది. ఇక సండై కోజి 2 పేరుతో రూపొందనున్న ఈ సినిమాలో విశాల్ తో పాటు తండ్రిగా చేసిన రాజ్ కిరణ్ అదే పాత్రలో కంటిన్యూ అవుతున్నాడు.

మరో విశేషం ఏంటంటే ఇందులో నెగటివ్ షేడ్స్ ఉన్న విలన్ తరహా పాత్రను వరలక్ష్మి శరత్ కుమార్ చేయటం. విశాల్ తో కొన్నేళ్ళ పాటు డీప్ లవ్ లో ఉన్న వరలక్ష్మి ఆ తర్వాత ఏదో అపార్థం వల్ల ఇద్దరం విడిపోయాం అని చెప్పుకుంది కాని అధికారికంగా విశాల్ కాని వరలక్ష్మి కాని ప్రకటించలేదు. ఇప్పుడు ఈ ఇద్దరు కలిసి ఒకే సినిమాలో నటించడం ఒక విశేషం అయితే అందులో వరలక్ష్మివిలన్ గా చేయటం అంటే ఫాన్స్ కు కిక్ ఇచ్చేదే. గతంలో పొగరు సినిమా ఇదే తరహా పాత్రను చేసిన విశాల్ అన్నయ్య భార్య శ్రియారెడ్డి గుర్తుకు వస్తోంది. ఇది కూడా అదే ఛాయల్లో ఉన్నట్టు కనిపిస్తోంది. నరసింహలో నీలాంబరి తరహాలో ఇది కూడా ఉంటుందని విశాల్ ఫాన్స్ ఎక్స్ పెక్ట్ చేస్తున్నారు. విడుదల ఇంకా ఖరారు కానీ ఈ మూవీ కూడా ఫస్ట్ పార్ట్ లాగే పూర్తి పల్లెటూరి నేపధ్యంలో పక్కాగా ఊర మాస్ గా రూపొందినట్టు తెలుస్తోంది. అసలు ఆకర్షణ హీరొయిన్ కీర్తి సురేష్. మహానటితో ఊహించని రేంజ్ కు చేరుకున్న కీర్తి సురేష్ నల్లనయ్య విశాల్ పక్కన మొదటిసారి చేస్తోంది.
Tags:    

Similar News