కోలీవుడ్లో ప్రస్తుతం ఎక్కడ చూసినా విశాల్ కొత్త సినిమా ‘తుప్పారివాలన్’ గురించే చర్చ. ఈ సినిమా చూసేందుకు ప్రేక్షకుడు కొనే ప్రతి టికెట్ నుంచి ఒక రూపాయి తమిళ రైతు సంక్షేమ నిధికి వెళ్తుందని ప్రకటించడంతో దీనిపై విడుదలకు ముందు పెద్ద చర్చే నడిచింది. మరోవైపు విలక్షణ దర్శకుడు మిస్కిన్ దర్శకత్వంలో విశాల్ నటించడం.. టీజర్.. ట్రైలర్ కూడా ఆసక్తి రేకెత్తించడంతో ‘తుప్పారివాలన్’పై భారీ అంచనాలు నెలకొన్నాయి. అందుకు తగ్గట్లే ‘తుప్పారివాలన్’కు సూపర్ హిట్ టాక్ కూడా వచ్చింది. ఈ సినిమా రిలీజవుతున్న తరుణంలోనే ఓ ప్రముఖ పైరసీ వెబ్ సైట్ అడ్మిన్ ను పోలీసులు అరెస్టు చేయడమూ చర్చనీయాంశం కాగా.. ఈ పరిణామంతో సంబంధం లేకుండా తమిళ్ రాకర్స్ అనే మరో పైరసీ వెబ్ సైట్ ఈ చిత్ర పైరసీ వెర్షన్ ను సైట్లో పెట్టేయడమూ సంచలనమే.
ఇలా అన్ని రకాలుగా ‘తుప్పారివాలన్’ వార్తల్లో నిలుస్తోంది నాలుగైదు రోజులుగా. ఐతే ఈ వివాదాలు.. చర్చల మధ్య ఈ చిత్రం మంచి వసూళ్లతో దూసుకెళ్తోంది. ఈ సినిమాను తెలుగులోకి కూడా అనువాదం చేయబోతున్నారు. ‘తుప్పారివాలన్’లో విశాల్ డిటెక్టివ్ పాత్ర పోషించాడు. ఈ నేపథ్యంలోనే తెలుగు వెర్షన్ కు ‘డిటెక్టివ్’ అనే టైటిల్ ఖరారు చేశారు. ఇప్పటికే డబ్బింగ్ పనులు మొదలయ్యాయట. అక్టోబర్లో ఈ చిత్రాన్ని తెలుగులో రిలీజ్ చేయనున్నారు. ఒకప్పుడు విశాల్ కు తెలుగులో మంచి ఫాలోయింగ్ ఉండేది. అతడి సినిమాలు తమిళంతో పాటు ఒకేసారి తెలుగులోనూ రిలీజయ్యేవి. కానీ తర్వాత తర్వాత విశాల్ ట్రాక్ రికార్డు దెబ్బ తిని.. అతడి తమిళ సినిమాలు కొంచెం లేటుగా తెలుగులో రిలీజవుతున్నాయి.