యాక్షన్ చిత్రాల దర్శకుడిగా మంచి పేరు దక్కించుకున్న వివి వినాయక్ లో నటుడు ఉన్నాడు. అప్పుడప్పుడు ఆయన కొన్ని సినిమాల్లో గెస్ట్ గా కనిపించాడు. నటనపై వినాయక్ కు ఇంట్రెస్ట్ ఉండటం వల్లే అప్పుడప్పుడు గెస్ట్ గా కనిపిస్తున్నాడని భావించిన దిల్ రాజు ఆయనతో ఒక పూర్తి స్థాయి సినిమా నిర్మించాలని భావించాడేమో.. వినాయక్ కు తగ్గ స్టోరీ అంటూ శీనయ్యను మొదలు పెట్టారు. దర్శకుడిగా బిజీగా ఉన్నా కూడా వినాయక్ కూడా శీనయ్య సినిమాను కాదనుకుండా ఒప్పుకున్నాడు. షూటింగ్ మొదలు పెట్టినప్పటి నుండి కూడా ఆ సినిమా పై కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తూ వస్తున్నారు. పలు సార్లు స్క్రిప్ట్ లో మార్పులు చేర్పులు చేసినా కూడా శీనయ్య సినిమా పూర్తి చేయడంలో విఫలం అయ్యారు.
ఇటీవల ఒక మీడియా కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వినాయక్ మాట్లాడుతూ... సినిమాకు సినిమాకు మద్య ఎక్కువ గ్యాప్ రావడానికి కారణాలు చాలా ఉన్నాయి. అందులో శీనయ్య కూడా ఒకటి అన్నాడు. శీనయ్య సినిమా కోసం కొంత సమయంను కేటాయించడం జరిగింది. కాని సినిమా వర్కౌట్ అవ్వదనే ఉద్దేశ్యంతో సినిమాను వదిలేసినట్లుగా ఆయన చెప్పేశాడు.
వినాయక్ మాటలను బట్టి చూస్తుంటే మళ్లీ శీనయ్య ను పునః ప్రారంభించే ఉద్దేశ్యం లేనట్లుగా అనిపిస్తుంది. శీనయ్య సినిమా తో వినాయక్ ఫుల్ లెంగ్త్ హీరోగా మారాలని భావించాడు. తనను నిర్మాతగా దిల్ సినిమా తో నిలిపినందుకు గాను వినాయక్ రుణం తీర్చుకునే ఉద్దేశ్యంతో శీనయ్య సినిమాను చేయాలనుకున్నాడు. కాని కథ విషయంలో ముందు నుండే అనుమానాలు.. షూటింగ్ మొదలు పెట్టిన తర్వాత మరింతగా అవ్వడంతో తీసి పరువు తీసుకోవడం ఎందుకు అనే ఉద్దేశ్యంతో యూనిట్ సభ్యులు సినిమాను పక్కకు పెట్టారు అంటూ ఇండస్ట్రీ వర్గాల టాక్.