బొద్దు మెహ్రీన్ అంత బక్కగా ఎలా మారిందబ్బా?

Update: 2021-11-01 06:53 GMT
మెహ్రీన్ అన్నంత నే బొద్దు గా గుండుమల్లె గుర్తుకు వస్తుంది? అలా అని మరీ బొద్దుగా కాకున్నా.. ఆమె హైట్ కు సరి పోయేలా ఉండే ఈ బొద్దు గుమ్ము.. ఇతర గ్లామర్ హీరోయిన్లకు కాస్త భిన్నంగా ఉండేది. అలాంటి ఆమె.. తాను కూడా సన్నజాజి మెగ్గలా మారి పోవాలని డిసైడ్ అయ్యింది. కానీ.. రోజు వారీ జీవితం లో ఆమెకు కుదిరేది కాదట. కరోనా..లాక్ డౌన్ పుణ్యమా అని నాలుగు గోడల మధ్యనే ఉండిపోవాల్సి రావటంతో.. తను మారటానికి ఇదే సరైన సమయంగా భావించిందట.

అలా బరువు తగ్గాలన్న కోరిక ను తీర్చుకునే అవకాశం కుదిరిందని చెబుతోంది. తాను చేసిన తాజా మూవీ మంచి రోజులు వస్తున్నాయి కోసం బరువు తగ్గినట్లుగా అందరూ అనుకుంటున్నారు కానీ.. అది నిజం కాదని చెప్పింది. నిజాని కి ఈ మూవీ కోసం సెట్ లోకి వచ్చే సమయానికి తాను మరింత సన్నగా ఉండే దానినని.. షూటింగ్ స్టార్ట్ అయ్యాక మూడున్నర కేజీల బరువు తాను పెరిగినట్లు చెబుతోంది. తాజాగా మెహ్రీన్ ను చూస్తే.. మరీ ఇంత సన్నగా కావటమా? అన్నట్లు గా ఆమె ఉంది. అలాంటిది మూడున్నర కేజీలు పెరగక ముందే మరెంత బక్కగా ఉండేదో? అన్న భావన కలుగక మానదు.

మరి.. ఇంతలా వెయిట్ లాస్ ఎలా సాధ్యమైంది? అందుకు ఏమేం చేసిందన్న విషయం లోకి వెళితే.. రోజు వారీగా వ్యాయామాలు.. ఆహార నియమాలు పాటిస్తూ బరువు తగ్గినట్లు గా చెప్పింది. ఇదంతా నెలల తరబడి చేయటం వల్లే సాధ్యమైందని చెప్పింది. తాను సన్నబడటం తనకు బాగానే ఉన్నా.. తనను అభిమానించే అభిమానుల కు మాత్రం నచ్చటం లేదని చెప్పింది. ‘కొంత మంది అభిమానులకు ఇలా సన్నబడటం నచ్చలేదు. వారికి నేనను ఎఫ్ 2లో హనీలా ఉండటమే ఇష్టం. ఇరవై సినిమాల్లో నన్ను అలా చూశారు కదా’ అని చెప్పిన ఆమె.. ఇక నుంచి తనను ఇలా చూసి కూడా మెచ్చుకుంటారని ఆశిస్తున్నట్లు చెప్పింది.
Tags:    

Similar News