రౌడీ హీరోకు కవితగారి ప్రశంసలు..!

Update: 2019-02-06 07:43 GMT
టాలీవుడ్ సెన్సేషన్ విజయ్ దేవరకొండ రీసెంట్ గా ప్రఖ్యాత '30 అండర్ 30' జాబితాలో స్థానం సంపాదించి అందరి చూపును మరోసారి తనవైపు తిప్పుకున్నాడు.  ఈ సందర్భంగా విజయ్  తన ట్విట్టర్ ఖాతా ద్వారా ఒక ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే.  పాతికేళ్ళ వయసులో తన ఆంధ్రా బ్యాంక్ ఖాతాలో ఐదు వందల రూపాయల మినిమమ్ బ్యాలెన్స్ లేకపోవడంతో తన ఖాతాను బ్యాంక్ వారు బ్లాక్ చేశారని.. ఆ సమయంలో తన నాన్నగారు '30 లోపే సెటిల్ అయితేనే సక్సెస్ ను ఎంజాయ్ చేయగలవని.. తల్లిదండ్రులు ఆరోగ్యంగా ఉన్నప్పుడు సక్సెస్ సాధిస్తేనే నిజమైన విజయం' అన్నారని.. నాలుగేళ్ల తర్వాత ఇప్పుడు '30 అండర్ 30' లిస్టులో ఉన్నానని తెలిపాడు.

ఈ ట్వీట్ కు స్పందించిన తెరాస నాయకురాలు ఎంపీ కవిత విజయ్ కు అభినందనలు తెలిపారు.  "30 అండర్ 30 లిస్టు లో స్థానం సాధించినందుకు కంగ్రాచులేషన్స్ విజయ్.. గ్రేట్ గోయింగ్.  మీ నాన్నగారి అంచనాలను అందుకున్నందుకు మెనీ మోర్ కంగ్రాచులేషన్స్... అది చాలా కష్టమైన పని"  అంటూ విజయ్ ను ప్రశంసించారు.  కవితక్క ప్రశంసలకు రౌడీ బాయ్స్ అందరూ ఆమెకు థ్యాంక్ యూ మెసేజులు పెడుతున్నారు.  ముఖ్యంగా కవితక్క చెప్పిన 'నాన్నగారి అంచనాలను అందుకోవడం చాలా కష్టమైన పని' అనే విషయం నిజమని.. ఎవరికైనా నాన్న అంచనాలను అందుకోవడం చాలా చాలా కష్టమని అంటున్నారు.

ఇదిలా ఉంటే విజయ్ ప్రస్తుతం భరత్ కమ్మ అనే డెబ్యూ దర్శకుడు తెరకెక్కిస్తున్న 'డియర్ కామ్రేడ్' సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాలో విజయ్ స్టూడెంట్ లీడర్ పాత్రలో నటిస్తున్నాడు.   రష్మిక మందన్న ఈ సినిమాలో విజయ్ సరసన హీరోయిన్ గా నటిస్తోంది.
Tags:    

Similar News