అక్కినేని అభిమానులు అయోమయానికి గురవుతున్నారా? .. అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఈ ఏడాది ప్రారంభం నుంచి అక్కినేని ఫ్యాన్స్ తీవ్ర నిరాశకు గురవుతూనేవున్నారు. నాగార్జున, నాగచైతన్య, అఖిల్ వంటి ముగ్గురు స్టార్స్ వున్నా ప్రాపర్ హిట్ తో ఫ్యాన్స్ ని ఖుషీ చేయలేకపోతున్నారు. ఈ హీరోలు నటించిన సినిమాలు బ్యాక్ టు బ్యాక్ డిజాస్టర్ లుగా మారుతుండటంతో ఫ్యాన్స్ అయోమయానికి గురవుతున్నారట. ఈ ఏడాది ప్రారంభంలో 'సోగ్గాడే చిన్నినాయనా'కు సీక్వెల్ గా విడుదలైన 'బంగార్రాజు' ఫరవాలేదనిపించింది.
అయితే ఆశించిన స్థాయిలో మాత్రం అక్కినేని ఫ్యాన్స్ ని ఆకట్టుకోలేకపోయింది. బ్లాక్ బస్టర్ సినిమాకు సీక్వెల్ గా వచ్చిన ఈ మూవీ ఆ రేంజ్ హిట్ ని అందిస్తుందని ఫ్యాన్స్ 'బంగార్రాజు'పై భారీ ఆశలే పెట్టుకున్నారు కానీ ఆ ఆశలు నెరవేరలేదు. ఆ తరువాత నాగచైతన్య నటించిన 'థ్యాంక్యూ', అమీర్ ఖాన్ తో కలిసి చేసిన 'లాల్‌సింగ్ చడ్డా' అని సూపర్ హిట్ లుగా నిలుస్తాయని ఆశిస్తే అవి డిజాస్టర్ లు అనిపించుకుని షాకిచ్చాయి.
చై ని లైట్ తీసుకుని నాగార్జున అయినా 'ది ఘోస్ట్'తో ఆకట్టుకుంటాడని అనుకుంటే మళ్లీ అక్కినేని ఫ్యాన్స్ కి నిరాశే ఎదురైంది. టీజర్, ట్రైలర్ లతో మంచి బజ్ ని క్రియేట్ చేసి అంచనాల్ని పెంచేసిన ఈ మూవీ దసరా బరిలో నిలిచి ఫస్ట్ డే ఫస్ట్ షో నుంచే తీవ్ర నిరాశకు గురిచేసింది. ఊహించని విధంగా ఫ్లాప్ సినిమా గా నిలిచి అక్కినేని అభిమానులకు షాకిచ్చింది. దీంతో ఫ్యాన్స్ అఖిల్ నటిస్తున్న 'ఏజెంట్' పైనే ఆశలు పెట్టుకున్నారు.
అఖిల్ నటిస్తున్న లేటెస్ట్ స్పై యాక్షన్ థ్రిల్లర్ 'ఏజెంట్'. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. ఏకె ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై అనిల్ సుంకర అత్యంత భారీ బడ్జెట్ తో ఈ మూవీని నిర్మిస్తున్నారు. ఈ సినిమాతో ఎలాగైనా పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ ని సొంతం చేసుకోవాలని అఖిల్ ఆశగా ఎదురుచూస్తున్నాడు. ఈ మూవీతో నెక్స్ట్ లెవెల్ హీరోల జాబితాలో చేరిపోవాలని అఖిల్ గట్టి ప్రయత్నాలే చేస్తున్నాడు. అయితే ఈ మూవీ రిలీజ్ టైమ్ ప్రధాన సమస్యగా మారినట్టు తెలుస్తోంది.
ముందు ఈ మూవీని 2021 డిసెంబర్ 24న రిలీజ్ చేయాలనుకున్నారు. కరోనా కారణంగా షూటింగ్ ఆలస్యం కావడంతో 2022 ఆగస్టు 12న విడుదల చేస్తున్నట్టుగా చిత్ర బృందం ప్రకటించింది. కానీ అది జరగలేదు. ఆ తరువాత ఈ ఏడాది డిసెంబర్ లో రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ ఆ డేట్ న కూడా ఈ మూవీ రావడం లేదని తెలుస్తోంది. షూటింగ్ ఆలస్యం అవుతున్న కారణంగా ఈ మూవీని సంక్రాంతికి రిలీజ్ చేయాలని చిత్ర బృందం ఫైనల్ గా నిర్ణయించినట్టుగా తెలిసింది. అయితే ఆ డేట్ న కూడా అఖిల్ 'ఏజెంట్' విడుదలయ్యే అవకాశం కనిపించడం లేదు.
కారణం చిరు సినిమా. చిరు నటిస్తున్న 154 మూవీ సంక్రాంతి బరిలో దిగుతోంది. దీనితో పాటు తమిళ డబ్బింగ్ సినిమాలు విజయ్ 'వారసుడు', అజిత్ 'తునివు' సంక్రాంతికి వస్తున్నామంటూ దాదాపుగా ప్రకటించేశాయి. ఈ సమయంలో నిర్మాత అనిల్ సుంకర అఖిల్ సినిమాని బరిలోకి దింపే సాహసం చేయడు.. అంటే సంక్రాంతి తరువాతే రిలీజ్ చేస్తాడు. అంటే జనవరి 26న విడుదల చేసే అవకాశం వుందని తెలుస్తోంది. అయితే జనవరి 25న షారుక్ ఖాన్ 'పఠాన్' వస్తోంది. చాలా ఏళ్ల విరామం తరువాత షారుక్ నుంచి వస్తున్న సినిమా కాండంతో ఉత్తరాదితో పాటు దక్షిణాదిలోనూ ఈ మూవీపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలుంటాయి.
'ఏజెంట్' పాన్ ఇండియా మూవీ.. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఒకే కానీ ప్రధానంగా 'పఠాన్'కి ఎదురెళితే ఈ మూవీ హిందీ మార్కెట్ దెబ్బతింటుంది. జనవరి 26న కూడా కష్టమే. ఈ నేపథ్యంలో అఖిల్ పైనే భారం వేసిన అక్కినేని అభిమానులు ఇంతకీ 'ఏజెంట్' ఎప్పుడొస్తుందని ఆమోయమానికి గురవుతున్నారట.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.