ఇండస్ట్రీ ఏమైనా కానీ.. అక్కడ తోపుల్లాంటి వారి మీద ఫైట్ చేయటం తర్వాత వారితో తలపడటమే పెద్ద విషయం. ఆ లెక్కన చూసినప్పుడు సింగర్ కమ్ డబ్బింగ్ ఆర్టిస్ట్ చిన్మయి పెద్ద సాహసమే చేస్తున్నారని చెప్పాలి. ఎవరు అవునన్నా.. కాదన్నా సినిమా ఇండస్ట్రీలో మేల్ డామినేషన్ భారీగా ఉంటుంది. సినిమా పరిశ్రమకు చెందిన ఏ రంగమైనా తీసుకోండి? ఎక్కడా మహిళల అధిక్యత ఎక్కడా కనిపించదు. ఆ మాటకు వస్తే.. గళం విప్పే వారి గొంతు బయటకు వినపడకుండా చేయటంలో సినిమా ఇండస్ట్రీ తర్వాతే ఎవరైనా అన్న వాదన వినిపిస్తూ ఉంటుంది.
ఇన్ని ప్రతికూలత మధ్య తమిళ చిత్రపరిశ్రమలో పెద్ద కొండలాంటి ప్రముఖ గేయ రచయిత వైరముత్తు ఆరాచకాల్ని.. లైంగిక వేధింపుల్ని బయటకు చెప్పి చిన్మయి సంచలనంగా మారారు. సోషల్ మీడియాను బాసటగా చేసుకొని తమిళ చిత్ర పరిశ్రమలో మీటూ వ్యవహారంలో వైరముత్తు.. నటుడు కమ్ నిర్మాత రాధారవిలపై సంచలన ఆరోపణలు చేశారు చిన్మయి.
తప్పు చేసినోడి గుట్టు రట్టు చేయటం సంచలనంగా మారితే.. ఆమె గళం విప్పిన కొద్దిరోజులకే అనూహ్యంగా చిన్మయిను డబ్బింగ్ యూనియన్ సభ్యత్వాన్ని రద్దు చేశారు. ఎందుకలా చేశారు? అన్న ప్రశ్నకు వార్షిక ఫీజును చెల్లించకపోవటమే కారణమన్న సిల్లీ రీజన్ చూపించారు. ఒకవేళ చిన్మయి లాంటివాళ్లు కట్టాలనుకున్నా.. కట్టించుకోకపోతే ఆమె మాత్రం ఏం చేయగలుగుతారు? ఆమె సభ్యత్వంపై వేటు వేసిన వేళలో.. ఆమె ఆరోపణలు చేసిన రాధారవినే డబ్బింగ్ యూనియన్ అధ్యక్షుడిగా ఉండటం గమనార్హం. దీంతో తనకు జరిగిన అన్యాయం పై కోర్టును ఆశ్రయించారు చిన్మయి.
ఆమె వాదనలకు సానుకూలంగా స్పందించిన న్యాయస్థానం.. ఈ కేసు పరిశీలనలో ఉన్నంత కాలం ఆమె డబ్బింగ్ యూనియన్ సభ్యురాలిగానే పరిగణించలంటూ కోర్టు విస్పష్టంగా పేర్కొంది. కోర్టు చెప్పిన తర్వాత ఆమె డబ్బింగ్ ఆర్టిస్టు యూనియన్ లో సభ్యురాలిగా ఉన్నప్పటికీ.. ఆమెకు సినిమా అవకాశాలు మాత్రం పెద్దగా రాని పరిస్థితి. ఇదిలా ఉంటే.. తాజాగా డబ్బింగ్ యూనియన్ కు ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల చేశారు.
మరోసారి అధ్యక్ష పదవికి పోటీచేయటానికి రాధారవి నామినేషన్ వేస్తే.. ఆయన పై పోటీకి చిన్మయి దిగారు. దీంతో.. ఈ వ్యవహారం మరోసారి సంచలనంగా మారింది. చిన్మయి ఎన్నికల బరిలోకి రావటం ఇష్టం లేని వారు కత్త వాదనను తెర మీదకు తెస్తున్నారు. అసలు డబ్బింగ్ ఆర్టిస్ట్ అసోసియేషన్ లోనే సభ్యురాలిగా లేని ఆమె.. ఎన్నికల్లో ఎలా పోటీ చేస్తారని ప్రశ్నిస్తున్నారు. ఈ వాదనలో నిజం ఉందనుకుంటే.. కోర్టు ఆర్డర్ మాటేమిటి? అని ప్రశ్నిస్తే మాత్రం సమాధానంరాని పరిస్థితి.
ఇదిలా ఉండగా.. తాను అసోసియేషన్ లో సభ్యురాలినేనని న్యాయస్థానం చెప్పిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు చిన్మయి. దీంతో.. ఆమె నామినేషన్ విషయంలో ఏం చేస్తారన్నది ఇప్పుడు ఉత్కంఠగా మారింది. కోర్టు ఆదేశాలకు భిన్నంగా వ్యవహరిస్తే.. ఆమె మళ్లీ న్యాయస్థానాన్ని ఆశ్రయించే వీలుందన్న మాట వినిపిస్తోంది. లీగల్ అంశాల్ని పరిగణలోకి తీసుకుంటే.. న్యాయస్థానం ఇచ్చిన ఆదేశాలు చిన్మయికి కొండంత అండగా నిలుస్తాయని చెబుతున్నారు. ఒకవేళ ఆమె ఎన్నికల బరిలో ఉంటే మాత్రం.. ఈ ఎన్నికలు మరింత ఆసక్తికరంగా మారుతాయని చెప్పక తప్పదు.