సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రముఖ ఎంటర్టైన్మెంట్ ఛానల్ జీ తెలుగులో ప్రసారమయ్యే 'డాన్స్ ఇండియా డాన్స్' అనే షోకి ముఖ్య అతిథిగా హాజరైన సంగతి తెలిసిందే. బుల్లితెర కార్యక్రమాలకు దూరంగా ఉండే మహేశ్.. ఇప్పుడు తన కుమార్తె సితార తో కలిసి ఒక డ్యాన్స్ షోకి రావడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. అయితే మహేష్ ఈ కార్యక్రమానికి హాజరవడం వెనుక పెద్ద స్టోరీ ఉన్నట్లు టాక్ వినిపిస్తోంది.
మహేష్ బాబు కు ఉన్న ఇమేజ్ మరియు క్రేజ్ ను దృష్టిలో పెట్టుకొని.. అతన్ని తమ బ్రాండ్స్ కు ప్రచారకర్తగా నియమించుకోడానికి కార్పోరేట్ కంపెనీలు వెంటపడుతుంటాయి. ఇప్పటికే ఎన్నో సంస్థలకు ఆయన బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్నారు. ప్రస్తుతం సూపర్ స్టార్ చేతిలో ఉన్నన్ని ఎండార్స్మెంట్స్ మరో హీరో వద్ద లేవని చెప్పడంలో అతిశయోక్తి లేదు.
గతంలో జీ తెలుగు ఛానల్ కు కూడా మహేష్ ప్రచార కర్తగా వ్యవహరించారు. ఈ క్రమంలో ఇప్పుడు మరోసారి ఆ ఛానల్ తో స్టార్ హీరో భారీ డీల్ కుదుర్చుకున్నట్టు టాక్ వినిపిస్తోంది. దీని విలువ దాదాపు 9 కోట్లు అని ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో మహేష్ ఈ ఛానల్ లో ప్రసారమయ్యే ప్రోగ్రామ్స్ మరియు సీరియల్స్ కు ప్రచారం చేస్తారని అంటున్నారు. ఇందులో భాగంగా డ్యాన్స్ షోకి గెస్టుగా వచ్చారని పేర్కొంటున్నారు.
టీవీ ఛానల్ తో మహేష్ బాబు డీల్ కుదుర్చుకున్నారనే దానిపై అధికారిక సమాచారం లేదు కానీ.. అతని నిర్ణయం పై అభిమానులు అసంతృప్తిగా ఉన్నట్టు సోషల్ మీడియాలో కామెంట్స్ ని బట్టి అర్థం అవుతోంది. మహేష్ లాంటి సూపర్ స్టార్ ఇలా టీవీ సీరియల్స్ షోలలో కనిపించడం వారికి నచ్చడం లేదు.
ఈ విషయంలో ఇప్పటికే సోషల్ మీడియాలో యాంటీ ఫ్యాన్స్ ని డిపెండ్ చేయడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు. 'బుల్లితెర సూపర్ స్టార్' అంటూ ట్రోల్స్ చేస్తున్నారు. దీనికి తోడు డ్యాన్స్ షో నుంచి వచ్చిన ప్రోమోలు కూడా అభిమానులను ఏమాత్రం ఎగ్జైట్ చేయడం లేదని తెలుస్తోంది.
జీ తెలుగు లేటెస్టుగా డ్యాన్స్ షోకి సంబంధించిన ప్రోమోని యూట్యూబ్ లో షేర్ చేసింది. ఇందులో మహేష్ బాబు చుట్టూ అల్లిన కామెడీ టీవీ స్టైల్ కు తగ్గట్టుగా ఉంది. ఇది మహేష్ ఫ్యాన్స్ ని నిరుత్సాహపరుస్తోంది. సూపర్ స్టార్ రేంజ్ కు ఇలాంటి క్రింగ్ కామెడీ ఏంటని కామెంట్స్ కూడా పెడుతున్నారు. యాంటీ ఫ్యాన్స్ కూడా ఎప్పటిలాగే వారిని ట్రోల్ చేయడం స్టార్ట్ చేశారు.
రాబోయే రోజుల్లో మహేష్ అభిమానులు ఇలాంటి కంటెంట్ ను చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే సూపర్ స్టార్ ఏడాది పొడవునా స్మాల్ స్క్రీన్ మీద కనిపించేలా అగ్రిమెంట్ చేసుకున్నారని టాక్. అయితే మహేష్ నిర్ణయంలో తప్పేమీ లేదని.. ఇది ఆయన్ని బుల్లితెర ప్రేక్షకులకు మరియు ఫ్యామిలీ ఆడియన్స్ కు మరింత దగ్గర చేస్తుందని మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు.
ఇక సినిమాల విషయానికొస్తే.. సమ్మర్ లో 'సర్కారు వారి పాట' తో అలరించిన మహేష్ బాబు.. వచ్చే ఏడాది వేసవిలో SSMB28 తో రానున్నాడు. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కనున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మరో వారంలో ప్రారంభం అవుతుంది. దీని తర్వాత ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో ఓ పాన్ ఇండియా మూవీ చేయనున్నారు మహేష్.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.