సినిమా నిర్మాణం అంటేనే రిస్కీ వ్యవహారం.. లాభాలు ఉంటాయో ఉండవో తెలియని వ్యాపారం. అందుకే అన్నీ బ్యానర్లు ఎక్కువ కాలం కొనసాగలేవు. ఒక సినిమా ఫ్లాప్ అయినా మరో సినిమా హిట్ అయితే సరే కానీ చేపట్టిన ప్రతి ప్రాజెక్టు నష్టాల బాట పట్టిస్తుంటే ఎవరికైనా నిర్మాణం కొనసాగించడం కష్టమే. ప్రస్తుతం ఏకె ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పరిస్థితి అలానే ఉందట.
ఏకె ఎంటర్టైన్మెంట్స్ పై అనిల్ సుంకర చాలానే సినిమాలు నిర్మించారు. అయితే వరసబెట్టి సినిమాలన్నీ ఫ్లాపులుగా నిలుస్తున్నాయి. గత రెండుమూడేళ్లుగా పరిస్థితి మరీ తీసికట్టుగా మారిందని ట్రేడ్ వర్గాల వారు చెప్తున్నారు. 'కిరాక్ పార్టీ'.. 'రాజుగాడు'.. 'సీత'.. 'చాణక్య' ఇలా అన్నీ బాక్స్ ఆఫీస్ దగ్గర ఫ్లాపులే. ఇక సంక్రాంతి సినిమా 'సరిలేరు నీకెవ్వరు' కలెక్షన్స్ బాగానే ఉన్నప్పటికీ ఏకె ఎంటర్టైన్మెంట్స్ కు మిగిలింది ఏమీ లేదని.. నిజానికి నష్టాలు వచ్చాయని అంటున్నారు.
మరి ఇలాంటి పరిస్థితిలో అనిల్ సుంకర నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏంటి అనే విషయం ఆసక్తికరంగా మారింది. సినిమా నిర్మాణంలోనే కాదు ఏకె వారికీ డిస్ట్రిబ్యూషన్లో కూడా నష్టాలు వస్తున్నాయట. మరి నష్టాలు వస్తూనే ఉన్నప్పటికీ సినిమా నిర్మాణం కొనసాగిస్తారా లేక సినిమాలు ఆపేస్తారా అని ఇండస్ట్రీలో చర్చ సాగుతోంది. ఒకవేళ నిర్మాణం కొనసాగిస్తే నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏంటో చూడాలి.