వివాహ బంధంతో రణబీర్ కపూర్-అలియాభట్ ఒక్కటయ్యారు. ఐదేళ్ల ప్రేమకు పుల్ స్టాప్ పెట్టి నవ దంపతులుగా ప్రేక్షకుల ఆశీస్సులు అందుకుంటున్నారు. హనీమూన్ ముగించుకుని కొత్త కాపురం మొదలు పెట్టడమే ఆలస్యం. 6 అంతస్తుల వాస్తు భవంతిలోనే నవ దంపతులు కాపురం మొదలు పెట్టనున్నారు. ఈ నేపథ్యంలో రణబీర్ కపూర్-అలియాభట్ ఆస్తులపై ఆరాలు మొదలయ్యాయి. వివాహమనంతరం ఈ జంట ఆస్తుల ఎంత ఉంటుందంటూ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.
అలియా-రణబీర్ ఆస్తుల విలువ 839 కోట్లుగా మారినట్లు సమాచారం. రణబీర్ నికర విలువ దాదాపు 330 కోట్లగా అంచనాలు ఉన్నాయి. నటుడిగా ప్రారంభమైన దగ్గర నుంచి నేటి వరకూ రణబీర్ ఎదిగిన విధానం..మార్కెట్ పరంగా అతని వృద్ది ఎలా ఉందన్నది నిపుణులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం ఒక్కో సినిమాకి రణబీర్ 50 కోట్లు తీసుకుంటున్నట్లు సమాచారం. ఇంకా వివిధ సంస్థలకు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తూ భారీగానే ఆర్జిస్తున్నట్లు తెలుస్తోంది.
'ఒప్పో'..'కోకా'..'టాటా'..'ఓరియో' వంటి అనే బ్రాండ్ లకు రణబీర్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్నారు. ఇంకా పలు చిన్న కంపెనీలు హీరో ఖాతాలో ఉన్నాయి. ఒక్కో బ్రాండ్ కి 6 కోట్లు వసూలు చేస్తున్నారు. కపూర్ వారసుడిగా బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన రణబీర్ డై బై డే షైన్ అవుతూ మార్కెట్ ని వృద్ది పరుచుకోవడంలో ముందున్నాడనే ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.
ఇక మహేష్ భట్ వారసురాలిగా అలియాభట్ 'స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్' చిత్రంతో ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. యువ నాయిక అనతి కాలంలోనే స్టార్ హీరోయిన్ల సరసన స్థానం దక్కించుకుంది. ఇటీవలే 'గంగూబాయి కతివాడి'తో ఆమె స్థానం సుస్థిరం అయింది. ఆమె బ్రాండ్ ఇమేజ్ రెట్టింపు అయింది. 'డఫ్ అండ్ పెల్ప్స్' నివేదికల ప్రకారం అలియా భట్ గత ఏడాదిలోనే యూఎస్ డీ 68.1 మిలయన్ గా ఉంది. ( అంటే 517 కోట్లకు పైగానే).
అదే ఏడాది టాప్ -5 జాబితాలో అలియా స్థానం దక్కించుకోవడం విశేషం. ఎన్నో కార్పోరేట్ కంపెనీలు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తోంది. ఒక్కో యాడ్ కి 2 కోట్లు ఛార్జ్ చేస్తుంది. సోదరి షాహీన్ భట్ తో కలిసి ముంబైలో ఖరీదైన విల్లాల్ని ఐతం కొనుగోలు చేసిందిట. సిటీలోని ప్రైమ్ ఏరియాలోనే అవి నెలకొన్నట్లు సమాచారం.
వాటి ద్వారానే ఏడాది కి కోట్ల ఆదాయం వస్తుందని సమాచారం. అలియాభట్ కి బాలీవుడ్ లో ఎటర్నల్ సన్ సైన్ అనే ప్రొడక్షన్ హౌస్ కూడా కలిగి ఉంది. 3000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఆఫీస్ స్పేస్ కలదు. ఆడిక్యూ 7.. ఆడిక్యూ 5.. ఆడి క్యూ 6.. బిఎండబ్ల్యూ 7 సిరీస్ .. ల్యాండ్ రోవర్..రేంజ్ రోవర్ లాంటి ఖరీదైన కార్లను కల్గి ఉంది. వాటి ధర మొత్తం లెక్కిస్తే కోట్లలో ఉంటుందని తెలుస్తోంది. భార్య భర్తలుగా మారినే నేపథ్యంలో ఇకపై కలిసి వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టే అవకాశం ఉంది.