కోలీవుడ్ స్టార్ హీరోల్లో కొందరికి తెలుగులో మంచి మార్కెట్ ఉంది. ఒకప్పుడు విక్రమ్, సూర్య లకి ఇక్కడ కూడా తెలుగు మార్కెట్ ఉండేది. అయితే ఇప్పుడు వరుసగా వారు చేసే సినిమాల రిజల్ట్ తేడా కొడుతుండటంతో ఉన్న పళంగా మార్కెట్ పడిపోయింది. అయితే ప్రస్తుతం విశాల్, కార్తి లకు మాత్రమే అంతో ఇంతో ఇక్కడ మార్కెట్ ఉంది.
ఇక కార్తి సినిమా యావరేజ్ అయినా ఇక్కడ కొంత వరకూ కలెక్షన్స్ రాబడుతున్నాయి. విశాల్ సినిమా కూడా అంతే. అందుకే ఈ ఇద్దరూ తెలుగు ప్రమోషన్స్ మీద ఎప్పుడూ ఫోకస్ పెడతారు. సినిమా రిలీజ్ కి ముందే ఇక్కడ కూడా ప్రమోషన్స్ జరిగేలా చూసుకుంటారు.
అయితే ఎప్పటి లాగే కార్తి హైద్రాబాద్ వచ్చి చేసిన ప్రమోషన్ 'ఖైదీ'కి కలిసొచ్చింది. ఇక తను రాకముందే సినిమాను జనాల్లోకి రీచ్ చేసాడు కూడా. కానీ విశాల్ మాత్రం తెలుగు ప్రమోషన్స్ లో ఈ సారి వీక్ అనిపించుకున్నాడు. ఇక్కడ 'యాక్షన్' కి సరైన పబ్లిసిటీ జరగ లేదు. మరీ ముఖ్యంగా సరైన ప్లానింగ్ లేక పోవడంతో రిలీజ్ రోజు వరకూ పాటలు రిలీజ్ చేశారు. 'యాక్షన్' ప్రమోషన్స్ లో అందరికీ ఇది కామెడీ గా అనిపించింది. అందు వల్లే సినిమా కు ఓపినింగ్స్ కూడా పెద్దగా రాలేదు. ఇక నెక్స్ట్ సినిమా నుండైన విశాల్ తెలుగు ప్రమోషన్స్ పై ఓ రెండు నెలల ముందే ఫోకస్ పెడితే తప్ప మళ్లీ మార్కెట్ పుంజుకోదు.