సౌత్ లో అగ్ర కథానాయికగా ఓ వెలుగు వెలిగిన శ్రుతి హాసన్ అకస్మాత్తుగా తెరవెనక్కి వెళ్లిపోవడం అభిమానుల్ని పెద్ద షాక్ కి గురి చేసిన సంగతి తెలిసిందే. రెండేళ్లుగా నటించకుండా హైడ్ అవ్వడానికి కారణమేంటో అభిమానులకు అర్థం కాలేదు. ఆ క్రమంలోనే విదేశీ బోయ్ ఫ్రెండ్ మైఖేల్ కోర్సలే తో శ్రుతి ప్రేమాయణం బయటపడింది. వ్యక్తిగత జీవితానికే ప్రాధాన్యతనివ్వడం వల్ల సినిమాల్లో నటించడం లేదని అప్పట్లో తెలిపింది. అయితే ఇటీవలే శ్రుతి మాట మార్చింది. బ్రిటన్ లో ఓ మ్యూజిక్ బ్యాండ్ తరపున ఆల్బమ్స్ రూపకల్పనలో ఏడాది పాటు బిజీగా ఉంటున్నానని తెలిపింది. ఎప్పటికప్పుడు శ్రుతి ఇలా మాట మార్చడంపై సందేహాలు నెలకొన్నాయి. తన మాటలకు, చేతలకు పొంతన కనిపించలేదని అభిమానులు సందేహిస్తున్నారు. అయితే నటించకపోవడానికి తన కారణాలు తనకు ఉన్నాయని సరిపెట్టుకున్నారంతా.
అయితే ఇంతలోనే శ్రుతి తిరిగి ఓ తెలుగు సినిమాలో నటించనున్నానని చెప్పడం ప్రస్తుతం ఆసక్తికర చర్చకు తావిచ్చింది. ``కొన్ని స్క్రిప్టులు విన్నాను. వాటిలో ఏదో ఒకటి ఫైనలైజ్ చేయాల్సి ఉందని శ్రుతి తాజాగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది. డాడ్ కమల్ హాసన్ రాజకీయారంగేట్రంపైనా మనసు విప్పి మాట్లాడిన శ్రుతి ప్రస్తుత సమాజానికి కమల్ హాసన్ లాంటి డైనమిక్ పొలిటీషియన్ అవసరం ఉందని అన్నారు.
నాన్న గారు రాజకీయాల్లోకి రాక ముందు వీటిపై అస్సలు ఆసక్తి లేదు. కానీ ఆయన రాజకీయాల్లో ప్రవేశించాక తెలుసుకోవాలన్న కుతూహాలం పెరిగింది. అలా తెలుసుకునే క్రమంలో ఎన్నో ఆసక్తికర విషయాలు తెలుస్తున్నాయి. జనాల బాధలు, సమస్యలు అర్థమవుతున్నాయి. అందుకే ప్రస్తుత సమాజానికి నాన్న లాంటి నాయకుడు కావాలి. అవినీతిని రూపు మాపే లక్ష్యంతో నాన్నగారు రాజకీయాల్లోకి వచ్చారు. అతడి ఆలోచనలు, భావజాలం ప్రతిదీ స్ఫూర్తిమంతం. అందుకే ఆయన నాయకుడిగా ఎదగాలని ఆకాంక్షిస్తున్నాను అని శ్రుతి తెలిపారు. నాన్నగారు సినిమాల కోసం ఎంచుకున్న కథలు, ఆయన విజన్ పరిశీలిస్తేనే ఆయనేంటో అర్థమవుతుంది. మార్పు కోసమే ఆయన రాజకీయాలు చేస్తున్నారు అని శ్రుతి తెలిపింది. తప్పనిసరిగా డాడ్ కే ఓటేయండని తంబీ ఓటర్లను కోరింది. మరి శ్రుతి పిలుపందుకుని కమల్ కి ఓటేస్తారా లేదా? అన్నది చూడాలి.