`వ‌కీల్ సాబ్` పై ఆ న‌లుగురు ప్ర‌భావం ఎంత‌?

Update: 2021-03-29 06:30 GMT
ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ క‌థానాయ‌కుడిగా న‌టించిన `వ‌కీల్ సాబ్`కి ఇప్ప‌టివ‌ర‌కూ ప్ర‌చారం ప‌రంగా ఆశించినంత హైప్ లేదు. అయితే దీనిని అధిగ‌మించేందుకు ప్రీరిలీజ్ వేడుక‌లు ట్రైల‌ర్ వేడుక‌లు అంటూ హంగామా సృష్టించ‌నున్నారు. ఇక‌పోతే తెలుగు రాష్ట్రాలు విదేశాల్లో బెనిఫిట్ షోలు.. స్పెష‌ల్ షోల పేరుతో  భారీ వ‌సూళ్లు సాధించాల‌ని టార్గెట్ చేశారు. అయితే వ‌కీల్ సాబ్ కి వేరే హీరోలు వారి న‌టించిన‌ సినిమాల నుంచి పోటీ ఉండ‌దా? అంటే.. వివ‌రాల్లోకి వెళ్లాలి.

వ‌కీల్ సాబ్ తో పాటు ప‌లు చిత్రాలు ఏప్రిల్ మొద‌టి వారంలో రిలీజ్ క్యూలో ఉన్నాయి. ఇప్ప‌టికే గోపిచంద్ న‌టించిన సీటీమార్ రిలీజ్ వాయిదా ప‌డింది. ఏప్రిల్ తొలి వారంలోనే ఈ సినిమా విడుద‌ల‌వుతుంద‌ని అంచ‌నా.  కింగ్ నాగార్జున న‌టించిన వైల్డ్ డాగ్ ఏప్రిల్ 2న విడుద‌ల‌వుతోంది. అలాగే డ‌బ్బింగ్ చిత్రాలు యువ‌ర‌త్న‌- సుల్తాన్ కూడా ఏప్రిల్ తొలి వారంలోనే రిలీజ‌వుతున్నాయి. నాని ట‌క్ జ‌గ‌దీష్ వ‌కీల్ సాబ్ రిలీజైన‌ రెండు వారాల వ‌ర‌కూ థియేట‌ర్ల‌లోకి రాదు.

ప‌వ‌న్ తో పాటు నాగార్జున‌.. గోపిచంద్ సినిమాలు థియేట‌ర్ల‌లో ఉంటాయి. కానీ ప‌వ‌న్ క్రేజు ముందు ఇంకేవీ నిల‌బ‌డ‌వు అన్న‌ది తెలిసిన వ్య‌వ‌హార‌మే. అలాగే వ‌కీల్ సాబ్ కి లాంగ్ వీకెండ్ అదనపు ప్రయోజనం. వైల్డ్ డాగ్ రిలీజై వారం పాటు ఆడాకే వ‌కీల్ సాబ్ వ‌స్తోంది కాబ‌ట్టి ఆ మేర‌కు వ‌సూళ్ల  షేరింగ్ స‌మ‌స్య‌ లేదు. సుల్తాన్ డబ్బింగ్ చిత్రం .ఇది వకీల్ సాబ్ పై ఎలాంటి ప్రభావం చూపదు. ఆ విధంగా వకీల్ సాబ్ కు అంతా క‌లిసొచ్చే ప‌రిణామాలే క‌నిపిస్తున్నాయి. భారీగా టిక్కెట్లు రేట్లు పెంచి బెనిఫిట్ షోలు స్పెష‌ల్ ప్రీమియ‌ర్ల‌కు పెద్ద రేటుతో టిక్కెట్టు ధ‌ర‌లు నిర్ణ‌యించారు కాబ‌ట్టి అదంతా క‌లిసొచ్చేదే. తొలి వీకెండ్ రికార్డులు న‌మోద‌య్యే అవ‌కాశం ఉంద‌ని ప‌వ‌న్ అభిమానులు అంచ‌నా వేస్తున్నారు.
Tags:    

Similar News