జయ బయోపిక్ వివాదం: గౌతమ్ మీనన్ ఆగ్రహం

Update: 2020-02-29 06:45 GMT
గౌతమ్ మీనన్.. మాంచి ప్రేమకథలు తీసే తమిళ దర్శకుడు.. ‘ఏమాయ చేశావే’ ‘ఘర్షణ’ సహా ఎన్నో ఫీల్ గుడ్ మూవీలు తెరకెక్కించారయన.. అయితే ఈ మధ్య కాలంలో ఆయన విజయాల శాతం తగ్గింది.

దీంతో తన సహజ శైలికి భిన్నంగా ‘క్వీన్’ పేరుతో జయలలిత బయోపిక్ ను వెబ్ సిరీస్ గా రూపొందించి విడుదల చేశాడు. ఇక జయలలితపై గౌతమ్ మీననే కాదు.. మరో దర్శకుడు ఏఏల్ విజయ్ ‘తలైవి’పేరుతో మరో బయోపిక్ మూవీని ఐదు భాషల్లో తీస్తున్నారు.

ఇక ఇవే కాదు.. నటి కంగనా రౌనత్ తాజాగా జయలలిత పాత్రలో నటిస్తున్న మూవీ నిర్మాణం లో ఉంది. అయితే ఇండస్ట్రీలో ఇప్పుడు జయలలిత బయోపిక్ చిత్రాలు వరుసగా వస్తుండడం తో జయలలిత సోదరుడి కూతురు జే దీప తాజాగా హైకోర్టు కెక్కింది. తన అనుమతి లేకుండా నిర్మించడాన్ని ఆమె వ్యతిరేకిస్తూ పిటీషన్ దాఖలు చేశారు. అయితే విచారించిన హైకోర్టు ఈ బయోపిక్ లపై నిషేధం విధించలేమని జే దీప పిటీషన్ ను కొట్టి వేసింది.

ఈ క్రమం లోనే మరో రిట్ పిటీషన్ ను జే దీప హైకోర్టు లో దాఖలు చేసింది. విచారించిన న్యాయమూర్తి దర్శకులు గౌతమ్ మీనన్, విజయ్ లకు నోటీసులు జారీ చేసింది.

దీనిపై గౌతమ్ మీనన్ తరుఫు న్యాయవాది తాజాగా కౌంటర్ పిటీషన్ దాఖలు చేశారు. దీపకు అసలు జయలలిత బయోపిక్ చిత్రాలను నిషేధించే అర్హత, హక్కు లేదని పేర్కొన్నారు. జయలలిత బతికి ఉన్నప్పుడు దీపను దగ్గరకే రానీయలేదని తెలిపారు. తాను తీస్తున్నది యాదార్థ ఘటనలు అని.. శివకుమార్ పుస్తకం ఆధారంగా తెరకెక్కిస్తున్న మూవీ అని తెలిపారు. దీంతో ఇరువర్గాల వాదనలు విన్న న్యాయమూర్తి విచారణను మార్చి 8కు వాయిదా వేశారు.
Tags:    

Similar News