మీకాంబినేష‌న్ ఇంకెప్పుడు P.K సారు?

Update: 2022-07-25 12:30 GMT
మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ 'ఆర్ ఆర్ ఆర్' సినిమాతో పాన్ ఇండియా స్టార్ అయిపోయారు.  ఇప్పుడా క్రేజ్ తో హాలీవుడ్ లో సైతం అవ‌కాశాలు వ‌స్తున్నాయి. చర‌ణ్ ఒకే చెప్పాలేగానీ అక్క‌డి  దిగ్గ‌జాలు చ‌ర‌ణ్ తీసుకెళ్లిపోవడానికి రెడీగా ఉన్నారు.  ఆర‌కంగా చ‌ర‌ణ్ తండ్రిని మించిన త‌న‌యుడిగా...బాబాయ్ ని మించిన బిడ్డ‌గా మ‌రింత మంది అభిమానం..ఆశీర్వ‌చ‌నాలు అందుకుంటున్నారు.

ఆ ర‌కంగా చ‌ర‌ణ్ రేంజ్ డే బై డే రెట్టింపు అవుతూనే ఉంది. కానీ ఇంత వ‌ర‌కూ బాబాయ్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఇచ్చిన మాట‌ని మాత్రం నిల‌బెట్టుకోలేదు. చ‌ర‌ణ్ త‌న బ్యాన‌ర్లో సినిమా చేయాల‌ని..సొంతంగా సినిమాకి ఎంత ఖ‌ర్చు అయిన‌ తానే పెడ‌తాన‌ని చ‌ర‌ణ్ పాన్ ఇండియా స్టార్ కాక ముందు నుంచి అంటున్నారు. అలాగే బాబాయ్ తో తాను ఓ సినిమా నిర్మించ‌డానికి రెడీగా ఉన్నాన‌ని చ‌ర‌ణ్ సైతం  అన్న సంద‌ర్భాలు కోక‌ల్ల‌లు.

కానీ ఇప్ప‌టివ‌ర‌కూ ఆ రెండు జ‌ర‌గ‌లేదు. కేవ‌లం మాట‌ల‌కే ప‌రిమితం త‌ప్ప‌..ఇప్ప‌టివ‌ర‌కూ ఆకాంబినేష‌న్స్ సాధ్య‌ప‌డ‌లేదు. ఇటీవ‌లే ప‌వ‌న్ సారు మ‌రోసారి పాత పాట‌నే పాడారు. దీంతో అభిమానులు సైతం ఈ విష‌యంలో నిరుత్సాహంలోనే మునిగిపోతున్నారు. అన్న‌య్యలు అన‌డం త‌ప్ప చేసిందెప్పుడు? ఇంకెప్పుడు  సాధ్య‌మ‌వుతుంది? అంటూ సందేహాలు వ్య‌క్తం చేస్తున్నారు.

మ‌రి ఈ రెండేళ్ల‌లోనైనా ఆ అవ‌కాశం ఉందా? అంటే ద‌రిదాపుల్లో కూడా క‌నిపించ‌లేద‌ని చెప్పాలి. ప‌వ‌న్ అక్టోబ‌ర్ నుంచి పూర్తి స్థాయిలో రాజ‌కీయ ప్ర‌చారంలో బిజీ అవుతారు. బ‌స్సుయాత్ర‌లు..ప్ర‌జాయాత్ర‌లంటూ ఏపీలో తిర‌గ‌నున్నారు. 2024 గెలుపే ల‌క్ష్యంగా  ముందుకు క‌ద‌ల‌బోతున్నారు. ఈ నేప‌థ్యంలో చేతిలో ఉన్న‌ సినిమాల్నే పూర్తిచేయ‌డానికి స‌మ‌యం దొర‌క‌డం లేదు.

అప్పుడెప్పుడో  మొద‌లుపెట్టిన సోషియో ఫాంట‌సీ 'హ‌రి హ‌ర వీర‌మ‌ల్లు' షూటింగ్ ఇంత వ‌రకూ పూర్తి కాలేదు. మ‌రో రీమేక్ సినిమాని సెట్స్ పైకి తీసుకెళ్లాల్సి ఉంది. మ‌రో డైరెక్ట‌ర్  పీకే కోసం వెయిట్ చేస్తున్నాడు.

ఇలా ప‌వ‌న్ ఇంత బీజీగా ఉంటే  చ‌ర‌ణ్ తో సినిమా నిర్మించ‌డం ఇంకెప్పుడు జ‌రుగుతుంది. పీకే సారి అబ్బాయ్ బ్యాన‌ర్లో న‌టించ‌డం ఇంకెలా కుదురుతుంది. అందుకే అభిమానులు సైతం ఈ కాంబినేష‌న్ ఇప్పుట్లో కుదిరేది కాద‌ని ఓ అంచ‌నాకి వ‌చ్చేస్తున్నారు. మ‌రి అబ్బాయ్-బాబాయ్ వాటినేమైనా బ్రేక్  చేస్తారేమో చూడాలి.
Tags:    

Similar News